![]() |
ప్రేమ మైకంలో కూరుకుపోయినప్పుడు ప్రేయసీప్రియులు తమ ప్రేమ ఎంతటి బలమైనదో చెప్పేందుకు ఏవేవో చేష్టలు చేస్తుంటారు. అందులో పచ్చబొట్లు పొడిపించుకోవడం ఒకటి...................................ఆమధ్య నయనతార కూడా ప్రియుడు ప్రభుదేవా పేరును తన చేతి పచ్చబొట్టు పొడిపించుకుంది. ప్రభుదేవా అంటే తనకు ఎంతటి ప్రేమో.. ఇలా చేసి చూపించింది. అయితే ఇటీవల ప్రభుదేవా నయనతార ముఖం చూడటం లేదట. ఆమెను వదిలేసి మొదటి భార్యతో మళ్లీ సంబంధాలు సాగిస్తున్నాడట. అంతేకాదు.. బాలీవుడ్ తెల్లపిల్ల హన్సికతోనూ పీకల్లోతు రొమాన్స్‌లో పడిపోయినట్లు కోలీవుడ్ సినీజనం చెపుతున్నారు.
ప్రభుదేవా వైఖరితో విసిగిపోయిన నయనతార అతడికి దూరమవ్వాలని నిర్ణయించుకున్నదట. ఇందులో భాగంగానే ఇటీవల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు... తమ ప్రేమకు జ్ఞాపకంగా తన చేతిపై ప్రభుదేవా పచ్చబొట్టు పొడిపించుకుంది. ఇపుడు తెరలన్నీ తొలగిపోవడంతో పచ్చబొట్టును చెరిపివేసేందుకు సిద్ధమవుతోందట. అంతేమరి.. ప్రేమ ఉన్నప్పుడు ఎంత కరచుకుని ఉంటారో.. విడిపోతే.. అలా బలవంతంగా అన్నీ చెడిపేసుకునేందుకు సిద్ధమవుతారు.

No comments:
Post a Comment