"ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. బిజీ బిజీగా యాక్ట్ చేస్తున్న నా దృష్టి షూటింగ్ చూడటానికి వచ్చిన కొంతమంది............................. పిల్లలపై పడింది. వారికి వినికిడి శక్తి లేదు. కాసేపు షూటింగ్ చూసిన తర్వాత... చప్పట్లు కొడుతూ, నా నటన బాగుందంటూ చేతులతో సంజ్ఞ చేశారు. అది నాకు 'ది బెస్ట్ కాంప్లిమెంట్' అనిపించింది" అన్నారు శ్రియ.
సినిమా తారలంటే కొంతమందికి చిన్న చూపు ఉంటుందని, ఆమె చెబుతూ ... " షూటింగ్‌లో భాగంగా రోడ్లు మీద, పబ్లిక్ ప్లేసెస్‌లో డాన్సులు చేస్తున్నప్పుడు మీకేమనిపించదా? అని కొంత మంది ఒకింత హేళనగా అడుగుతుంటారు. అలా రోడ్లు మీద షూటింగ్ చేసినప్పుడు మాకిలాంటి మంచి కాంప్లిమెంట్స్ అందుతాయని వాళ్లకేం తెలుసు. ఇతరుల వృత్తిని గౌరవించడం ఓ సంస్కారం. ఆ సంస్కారం లేనివాళ్ల గురించి మాట్లాడి మన టైమ్ వేస్ట్ చేసుకోకూడదు" అన్నారు.
ఇదిలా ఉంటే ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే... శ్రియ సేవా కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటుంటారు. పేద పిల్లలను చదివించటం కోసం ఇప్పటికే ఆమె ఓ సేవా సంస్థతో కలపి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మురికివాడలను కూడా సందర్శిస్తుంటారు. అలాగే 'శ్రీ' పేరిట ఓ స్పా ఆరంభించి అందులో అంధులకు పని కల్పించారు. ఆ స్పాకి కావల్సినంత ప్రచారం కల్పించమని, చూపు లేకపోయినా తమ వంతు సేవలందిస్తున్నవారిని ప్రోత్సహించమని ట్విటర్ ద్వారా కోరారు శ్రియ.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ " అంధులే కదా. వీరేం చేయగలుగుతారు? అని తక్కువుగా ఊహించుకోకండి. భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి మీరు శ్రీ స్పాకి రండి. మీకు కావల్సిన విధంగా మావాళ్లు సేవలిందిస్తారు" అంటున్నారు.

No comments:
Post a Comment