Wednesday, February 22, 2012

సైఫ్ అలీఖాన్ అరెస్టు - బెయిల్: తాజ్‌లో వ్యక్తిపై దాడే కారణం (వీడియో)

ప్రియురాలు పక్కనుంటే ఎంతటివాడైనా రకరకాల పిల్లిమొగ్గలు వేస్తాడు. కాకపోతే ఈ పిల్లిమొగ్గలు అప్పుడప్పుడు శృతిమించి మరొకరిపైకి విలనిజం......................... చూపెట్టే స్థాయికి చేరుకుంటాయి. ఇదే సైఫ్ అలీఖాన్ విషయంలోనూ జరిగింది.  సైఫ్ తన ప్రియురాలు కరీనా కపూర్‌ను వెంటేసుకుని మంగళవారం రాత్రి ముంబైలోని తాజ్ హోటల్‌కు వెళ్లాడు. వారితోపాటు బాలీవుడ్ నటీమణులు మలైకా అరోరా ఖాన్, అమృతా రావులు కూడా ఉన్నారు. సెలబ్రిటీలు కదా.. వారేం మాట్లాడినా... ఎలాంటి దరువు చేసినా ఎవరేం మాట్లాడరనుకున్నారే ఏమో.. హై పిచ్‌లో గొంతులు పెంచి డిన్నర్ టేబుల్ ముందు గోల చేయడం ప్రారంభించారట.

ఆ ప్రక్క టేబుల్‌లో కూచుని వీరి దరువును భరించలేని ఇక్బాల్ శర్మ అనే వ్యక్తి కాస్త సౌండ్ తగ్గించండయ్యా బాబో అని అరిచాడట. అంతే.. హీరో సైఫ్ తన విలనిజాన్ని చూపించాడట. ఇక్బాల్ ముక్కుపై పిడికిలితో ఓ గుద్దు వేశాడు.

గాయపడిన ఇక్బాల్ నేరుగా వెళ్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడం.. సైఫ్ అరెస్టు.. ఆ తర్వాత బెయిలు.. అలా జరిగిపోయాయి. మొత్తమ్మీద సైఫ్ అలీఖాన్ మాత్రం తన గాళ్ ఫ్రెండ్ ముందు హీరోయిజమే కాదు... విలనిజం కూడా చూపించానని కాలరెగరేస్తాడేమో మరి.
సౌజన్యం : స్టార్ న్యూస్

No comments:

Post a Comment