Tuesday, February 21, 2012

నెలసరిలో కలయిక.... గర్భం వస్తుందా ?

నెలసరి అంటే.. గర్భాశయంలోని ఎండోమెట్రియం పొర రక్తస్రావం రూపంలో వెలుపలకి వచ్చేస్తుంటుంది. అలాంటి సమయంలో లైంగిక చర్యలో................................................. పాల్గొనడం వల్ల గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఎక్కువ. దానికితోడు అసౌకర్యం కూడా. అందుకే నెలసరి సమయంలో లైంగిక చర్యకు దూరంగా ఉండాలంటారు.

ఇక నెలసరి సమయంలో అండం విడుదల కాదు గనుక గర్భం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి భయపడాల్సిన అవసరంలేదు. కానీ ఇప్పుడిపుడే పిల్లలు వద్దనుకుంటే మాత్రం గైనకాలజిస్టును సంప్రదించి... దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉండే గర్భనిరోధక సాధనాల్ని ఎంచుకోవటం మంచిది.

హార్మోన్ల మోతాదు తక్కువగా ఉంటే మాత్రలే కాదు... నువా రింగ్ అనే సురక్షిత విధానమూ ఈ రోజుల్లో అందుబాటులో ఉంది. నెలకోసారి ఆ రింగ్‌ను మార్చుకోవడం లేదా ఒకే సమయానికి మాత్రలు వేసుకోవడం వల్ల గర్భం రాకుండా జాగ్రత్తపడవచ్చు.

No comments:

Post a Comment