Thursday, February 23, 2012

స్వలింగ సంపర్కాకికి వ్యతిరేకం : సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి!!

supreme court
స్వలింగ సంపర్క సెక్స్ (గే సెక్స్)ను వ్యతిరేకిస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్ర...............................హోంశాఖ గురువారం స్పష్టం చేసింది. ఒకే జాతికి చెందిన పెద్దల మధ్య స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది.

ఈ తరహా సెక్స్ సామాజిక పరిస్థితులకు వ్యతిరేకమని, అనైతికమని అపెక్స్ కోర్టుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన నైతిక, సాంఘీక విలువలు భిన్నంగా ఉంటాయని, అందువ్లల ప్రాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించలేమని అందులో స్పష్టంగా పేర్కొంది.

కాగా, గత 2009 సంవత్సరంలో గే సెక్స్‌ను ఢిల్లీ హైకోర్టు చట్టబద్ధం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. అలాగే ఈ తరహా సెక్స్‌లో పాల్గొనడం నేరం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ తయారు చేసిన నిబంధనలను నిలివివేసింది.

ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 16 మంది సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన అపెక్స్ కోర్టు కేంద్ర ప్రభుత్వ వివరణను కోరడంతో హోంమంత్రిత్వ శాఖ గురువారం ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. ఇందులో గే సెక్స్‌ను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది.

అంతేకాకుండా స్వలింగ సంపర్కం అనైతికమే కాదు.. ప్రకృతికి వ్యతిరేకమని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపింది. దీనివల్ల హెచ్.ఐ.వి.లాంటి వ్యాధులు వ్యాపిస్తాయంది. స్వలింగ సంపర్కం ప్రకృతికి వ్యతిరేకమని చెబుతూ కొందరు దాఖలు చేసిన పిటీషనును విచారించే క్రమంలో కొన్ని రోజుల క్రితం సుప్రీం కొన్ని వ్యాఖ్యలు చేసింది. "అసలు ప్రకృతి వ్యతిరేక లైంగిక సంపర్కం అంటే ఏమిటో?" వివరించాలంటూ పిటీషనర్లను కోరింది.

భారత్‌లో అత్యధికులు ఈ తరహా లైంగిక విధానాలకు వ్యతిరేకంగా ఉండగా, కొన్ని హక్కుల గుంపులు స్వలింగ సంపర్క స్వేచ్ఛను మానవ హక్కుల కోణంలో చూడాలంటూ ఎప్పటినుంచో వాదిస్తున్నాయి. కాగా, భారత శిక్షా స్మృతిలో 377 సెక్షను ప్రకారం స్వలింగ సంపర్కం అనేది నేరం. అయితే, ప్రస్తుతం వాడుకలో ఉన్న శిక్షాస్మృతి బ్రిటీషు కాలం నాటిది. అయితే, మూడేళ్ల క్రితం ఢిల్లీ హైకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ, ఇద్దరు వయోజనులు తమ ఇష్టానుసారంగా స్వలింగ శృంగారానికి పాల్పడటాన్ని నేరంగా భావించనక్కరలేదని చెప్పింది.

ఈ తీర్పు దేశంలో సంచలనానికి దారితీసింది. హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి ముందు ఈ తరహా శృంగార క్రియలను కనీసం 10 సంవత్సరాల జైలు అనుభవించే అవకాశాలుండేవి. హైకోర్టు తీర్పును దేశంలోని స్వలింగ సంపర్కుల సంఘాలు స్వాగతించగా, కొన్ని రాజకీయ, మతపరమైన సంస్థలు వ్యతిరేకించాయి. తీర్పును సమీక్షించాలంటూ పట్టుబట్టాయి.

గతవారం, ఈ అంశంపై పిటీషనును విచారిస్తూ, సుప్రీం మరోమారు ఈ శృంగారం నైతికమా, అనైతికమా అంటూ చర్చకు తెరలేపింది. ఇద్దరు వయోజనులు పరస్పర అంగీకారంతో నాలుగు గోడల మధ్య శృంగారం చేయడం తప్పు ఎలా అవుతుందో చెప్పమని స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకించేవారికి సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం తన వైఖరిని కోర్టులో తెలిపింది. చట్టప్రకారం ఈ శృంగారాన్ని ఆమోదించలేమని చెప్పింది.

No comments:

Post a Comment