Friday, February 24, 2012

దేవ్ పటేల్‌తో మళ్లీ జతకట్టనున్న ఫ్రిడా పింటో!

Dev, Frida
స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా హీరోయిన్ గుర్తుందా? ఆమేనండీ ఫ్రిడా పింటో.. ఈ భామ మళ్లీ ఆ చిత్ర హీరో, తన లైఫ్ బాయ్‌ఫ్రెండ్ దేవ్ పటేల్‌‌లో కామెడీ చిత్రంలో నటించబోతుందని తెలిసింది..............................................స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంతో తమ ప్రేమాయణాన్ని సాగించిన దేవ్ పటేల్-ఫ్రిడా పింటోలు ఆ తర్వాత బిజీ బిజీగా కాలం గడిపారు.

ప్రస్తుతం ఇద్దరు కలిసి ఓ కామెడీ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. కాగా స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దేవ్ పటేల్‌తో నటించబోయే కామెడీ చిత్రంపై ఫ్రిడా పింటో మాట్లాడుతూ.. నేను ఆ ప్రాజెక్టుపై పెట్టుకున్న అంచనాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక 'స్లమ్‌డాగ్' వంటిది మళ్లీ పునరావృత్తం కాదు. నేను దానిని ఆ అంచనాలను అందుకోవడానికి కష్టం అని తెలుసునని చెప్పింది.

No comments:

Post a Comment