Monday, February 27, 2012

నేడు ఖగోళ అద్భుతం : ఖగోళ వీక్షకులకు కనువిందు!

planets
ఆకాశంలో సోమవారం అద్భుతం చోటు చేసుకోనుంది. సూర్యాస్తమయం తర్వాత ఒకేసారి నాలుగు గ్రహాలు ఆకాశంలో కనిపించనున్నాయి.........................ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ వీక్షకులు కూడా ఎంతో ఆత్రుతగాఎదురు చూస్తున్నారు.  దీనిపై ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ రఘునందన్ మాట్లాడుతూ, భూమి నుంచి చూస్తే బృహస్పతి, చంద్రుడు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయని చెప్పారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారమైతే దీన్ని బృహస్పతి చంద్రుడితో కలవడంగా చెప్తారన్నారు.  అయితే ఖగోళ శాస్త్ర ప్రకారం భూమి నుంచి చూసినప్పుడు ఈ రెండుగ్రహాలు ఒకదానికి మరొకటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయన్నారు. ఈ అద్భుత ఘటం సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఆకాశంలో పశ్చిమ దిక్కులో బృహస్పతి గ్రహాన్ని చూడవచ్చని తెలిపారు.
భూమికి సహజ ఉప గ్రహంగా చెప్పుకునే చంద్రుడికి దిగువగా పశ్చిమ దిశగా శుక్రగ్రహాన్ని కూడా చూడవచ్చన్నారు. బృహస్పతి, శుక్రుడు, నెలవంక మూడూ వరుసగా ఆకాశంలో పశ్చిమ వైపున సాయంకాలపు నీరెండ వెలుగులో త్రికోణాకారంలో కనిపిస్తాయన్నారు.  ఇవి మూడు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి గనుక నగర విద్యుద్దీపాల వెలుగులో సైతం వీటిని చూడడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. సూర్యాస్తమయం తర్వాత శనిగ్రహం కూడా ఆకాశంలో తూర్పు వైపున కనిపిస్తుందని రఘునందన్ వివరించారు.

No comments:

Post a Comment