Monday, February 27, 2012

ఇద్దరు భామలతో కులుకుతున్న ప్రభుదేవా... మేకప్‌మెన్‌తో నయనతార..?

నయనతార - ప్రభుదేవాల లవ్వాటకు బ్రేక్ పడిందనీ, ఇక వారిద్దరూ పెళ్లి చేస్కునే ఛాన్సే లేదని కోలీవుడ్ సినీజనం అంటున్నారు. వీరి మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందన్న........................ దానికి హన్సిక.. ఇంకా ఒకరిద్దరు హీరోయిన్ల పేర్లు ఉటంకిస్తున్నారు కోలీవుడ్ సినీజనం.  తనను ప్రేమిస్తూనే మరో ఇద్దరు భామలతో ప్రభుదేవా కులకటాన్ని తట్టుకోలేని నయనతార అతడిని ఛీ కొట్టిందట. అంతటితో ఊరుకుందా.. అంటే.. లేదని అంటున్నారు. ఇటీవల నయన ఓ మేకప్‌మేన్‌తో గంటలకొద్దీ కాలం గడుపుతున్నట్లు చెపుతున్నారు. వ్యవహారం చూస్తుంటే అతడితో లవ్వాట మొదలుపెట్టిందో ఏమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదండోయ్.. ఇదే మాటను ఆమె సన్నిహితుల వద్ద వాకబు చేస్తే.. మీకేం పనీపాట లేదా... ఎప్పుడూ గాలి వార్తలు రాయడమేనా.. నయనతార కథా చర్చల్లో చాలా బిజీగా ఉంది. ఇక ఆమెకు ఖాళీ సమయం ఎక్కడ దొరుకుతుందీ అని అన్నారట. అయినా ఇవన్నీ ఎందుకూ.. ఎవరో ఒకర్ని పెళ్లి చేస్కుని సెటిలైపోతే ఈ వార్తలు రావు కదా అని సలహా ఇచ్చాడట ఓ పిల్లజర్నలిస్టు. నయన ఆ పిల్లజర్నలిస్టు మాట పట్టించుకుంటుందా...?

No comments:

Post a Comment