ప్రస్తుతం తాను నటిస్తున్న ‘హౌస్‌ఫుల్ 2’ చిత్రంలో అసలు బికినీ సీన్లు లేవని, తాను.........................
ఈ చిత్రంలో బికినీ ధరిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటోంది మలయాళీ కుట్టి అసిన్. హౌష్ ఫుల్ చిత్రంలో దీపిక పడుకొనె, లారా దత్తా, జియాఖాన్‌లు బికినీలతో వెర్రెత్తించారు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో బికినీ సీన్లు లేక పోవడం ఏమిటి? అని మీడియా వారు ప్రశ్నించగా....‘ఈ సీక్వెల్ లో స్కిన్ షో ఉండదు. ఫ్యామిలీ డ్రామాతో కూడిన వినోదం మాత్రమే ఉంటుంది. ఇందులో మేం బికినీ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ కథకి అటువంటి సీన్లు అక్కర్లేదు. తండ్రీ కూతుళ్ల మధ్య, నలుగురు కుర్రాళ్ల మధ్య నడిచే కథ ఇది. ఏ అమ్మాయి అయినా బికినీ వేసుకుని తండ్రి ముందు తిరుగుతుందా... తిరగదు కదా? అని సమాధానం ఇచ్చింది.అక్షయ్ కుమార్, అసిన్, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితేష్ దేశ్ ముఖ్, జరీన్ ఖాన్, శ్రేయ తల్పడే, షాజన్ పదంసి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈచిత్రాన్ని సాజిద్ నడియా వాలా నిర్మిస్తుండగా, సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మలైకా అరోరా ఐటం సాంగుతో అందాల విందు చేయనుంది. త్వరలోనే ఈచిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.
No comments:
Post a Comment