Sunday, April 1, 2012

బాలీవుడ్ హాట్ నటి బిపాసాను పెళ్లాడనున్న రానా?

rana
బాలీవుడ్ చిత్ర రంగానికి చెందిన హాట్ నటి బిపాసా బసును............................టాలీవుడ్ యువ హీరో రానా వివాహం చేసుకోనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ కేంద్రంగా ప్రచురితమయ్యే ఆంగ్ల పత్రిక ఒకటి వార్తా కథనాన్ని ప్రచురించింది.

బిపాసాను వివాహం చేసుకునేందుకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా పచ్చజెండా ఊపారని, మిగిలిన విషయాలు చర్చించుకునేందుకు వీరంతా త్వరలోనే రామానాయుడు స్టూడియోలో కలుసుకోనున్నట్టు సమాచారం.

ఈ వార్తను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. యువ హీరో అయిన రానా.. ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు చర్చించుకుని, రానాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా చెప్పారట. ఆ తర్వాతే తెలిసింది వారికి. ఏప్రిల్ ఫూల్ చేసేందుకే ఆ పత్రిక ఈ తరహా కథనాన్ని ప్రచురించినట్టు.

No comments:

Post a Comment