అలనాటి బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా.. తిరిగి వెండితెరపై................... దర్శనమీయనుంది. 1989 సంవత్సరంలో ఓ నేపాలీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. కానీ బాలీవుడ్‌కు మాత్రం సుభాష్ ఘాయ్ నిర్మించిన చిత్రంతో 1991లో అరంగేట్రం చేసింది. అలాగే, అనేక తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో కనిపించారు.
దేశంలో ప్రముఖ హీరోయిన్లలో ఒకరిగా 42 యేళ్ళ మనీషా గుర్తింపు పొందారు. అన్ని రకాల హావ భావాలను ప్రదర్శించకలిగిన ఈ ముద్దుగుమ్మకు "1942 ఏ లవ్ స్టోరీ", "బాంబే", "కామోషీ", మ్యూజికల్ హిట్ చిత్రం "దిల్ సే" ఇలా అనేక చిత్రాలు ఆమె కెరీర్‌లో ప్రధాన మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు.
2010లో వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె మళ్లీ బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌గా వస్తానన్న డైలాగ్‌కు అనుగుణంగా ఈ ముద్దుగుమ్మ ఐదు చిత్రాల్లో నటించేందుకు పచ్చజెండా ఊపేసిందట.
ఇందులో మూడు చిత్రాల క్యాల్షీట్లపై సంతకాలు చేశానని, ఈ చిత్ర వివరాలను నిర్మాతలు త్వరలోనే వెల్లడిస్తారని మనీషా చెపుతోంది. మొత్తం మీద.. 42 యేళ్ల మనీషా ఆంటీనీ మళ్లీ వెండితెరపై హీరోయిన్‌గా చూసే భాగ్యం అభిమానులకు కలుగనుందన్నమాట.

No comments:
Post a Comment