Monday, April 2, 2012

హైటెక్ వ్యభిచారం... తారా చౌదరి ఉచ్చులో పొలిటికల్ లీడర్స్

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు... పొలిటికల్ ఇండస్ట్రీలోనూ తారా చౌదరి............................... తుఫాన్ సృష్టిస్తోంది. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన తారా చౌదరి, ఆ తర్వాత వ్యభిచారాన్ని ప్రవృత్తిగా స్వీకరించింది. సోమవారంనాడు ఆమె నివాసం ఉంటున్న ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు విషయాలు బయటపడ్డాయి.
తారా చౌదరి తన వద్దకు వచ్చే అమ్మాయిలను స్పై కెమేరాల్లో బంధించినట్లు తేలింది. ఈ కెమేరాలలో ఛాన్సుల కోసం వచ్చిన అమ్మాయిలను నగ్నంగా చిత్రీకరించేదనీ, ఆ తర్వాత కొన్నాళ్లకు సదరు అమ్మాయిల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఆ నగ్న వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని షరతులు విధించేదట. ఎవరైనా చెప్పిన మాట వినకపోతే.. ఇక అంతేసంగతులు.. సదరు అమ్మాయి నగ్న వీడియో నెట్ లో హల్ చల్ చేసేస్తుంది.

తారా చౌదరి ఇంతటితో ఆగిపోలేదు. పొలిటికల్ సపోర్ట్ ఉంటే తాను చేస్తున్న అడ్డగోలు పనులకు అడ్డే లేకుండా ఉంటుందని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయా పార్టీలకు చెందిన లీడర్లను బుట్టలో వేసుకుని స్పై కెమేరాల్లో వారి శృంగార లీలలను బంధించినట్లు సమాచారం. ఆమెకు సంబంధించిన గదిలో తనిఖీలు నిర్వహించినపుడు పలువురు నాయకుల ఫోన్ నెంబర్లు లభ్యమైనట్లు చెపుతున్నారు.

ముఖ్యంగా తార ఉచ్చులో ప్రతిపక్ష నేతలు చాలామంది చిక్కుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఒక బడా వ్యాపారవేత్త హత్యకు సైతం ముంబాయి కిల్లర్స్‌తో తారా చౌదరి ప్లాన్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన తారపై చిలుకలూరి పేటలో కేసులు నమోదై ఉన్నాయి. తారా చౌదరి అలియాస్ రాజేశ్వరి హైదరాబాదులో ఉన్న అమ్మాయిల్ని బుట్టలో వేయడం సులభం కాదని తెలిసి, రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలపై దృష్టి సారించేదట.

అక్కడికి వెళ్లి పెద్దపెద్ద షాపుల్లో షాపింగ్ చేస్తున్నట్లుగా వెళ్లి, అందమైన సేల్స్ గర్ల్స్‌ను చూసి.. ఇక్కడ ఎన్నాళ్లు పనిచేస్తే ఎంత సంపాదించగలవు.. హైదరాబాదు వస్తే ఇంతకు పదింతలు ఆర్జించే మార్గం ఉన్నదనీ, అలా రావాలనుకుంటే తనకు ఫోన్ చేయమంటూ నెంబరు ఇచ్చేది. సదరు అమ్మాయిలు వెతుక్కుంటూ హైదరాబాదు వస్తే వారికి అనుమానం రాకుండా మంచి గెస్ట్ హౌస్‌లో అతిథి మర్యాదలు చేసి అనంతరం వారిని బలవంతంగా వ్యభిచారం కూపంలోకి నెట్టేది.

ఇలా 2005 నుంచి అడ్డదారిలో పయనిస్తూ వచ్చిన తారా తారా ఉచ్చులో పలువురు పొలిటికల్ లీడర్స్ కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి శృంగార లీలలను తన కెమేరాల్లో బంధించినట్టు సమాచారం. అంతేకాదు సినీ కథారచయిత చిన్నికృష్ణను సైతం ఆ మధ్య వణికించిందట. దీంతో ఆమెకు కొంత డబ్బును ముట్టజెప్పి చిన్నికృష్ణ బయటపడ్డారని చెపుతారు.

అదృశ్యం, రాకెట్.. లోబడ్జెట్ సినిమాల్లో నటించిన తార వ్యభిచార వృత్తినే ప్రధాన వృత్తికి స్వీకరించి ఎంతోమంది అమాయక యువతుల జీవితాలతో ఆడుకున్నట్లు వెలుగు చూసింది. తారా చౌదరి వ్యవహారంపై విశాఖపట్నంకు చెందిన లక్ష్మీ అనే యువతి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు పూర్తిస్థాయిలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో మరెన్ని అంశాలు వెలుగు చూస్తాయో వెయిట్ అండ్ సీ.

No comments:

Post a Comment