Wednesday, April 4, 2012

నథాలియా నా ముందు నథింగ్... మధుశాలిని ఫోజు

madhu shalini
బ్రెజిల్ భామ నథాలియా తనతో పోటీ పడుతుందా....................నెవర్‌... అంటోంది మధుశాలిని. తాజాగా ఆమె రామ్‌గోపాల్‌వర్మ చిత్రం 'డిపార్ట్‌మెంట్‌'లో నటిస్తోంది. ఆ చిత్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నానని అంది. ఆ చిత్రంలో బ్రెజిల్‌ భామ నథాలియా ఐటం సాంగ్‌ చేస్తుందని చెప్పింది.
మీ పాత్రకంటే ఆమె పాత్ర బాగుందంటున్నారని అడిగితే... నాన్సెన్స్‌... ఆమెకు నాకు పోలికా... ఆమె ఓన్లీ ఐటంగాళ్‌. నాకు బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయని అంది. తెలుగు, తమిళంలో మంచి పాత్రలు పోషించాను. బాలీవుడ్‌లో కూడా పోషిస్తాను. అంతేగానీ ఐటంగాళ్‌గా నటించే అవసరం నాకు లేదని తేల్చి చెప్పింది.
ఇక వర్మ విషయానికి వస్తే.. ఆయనకు ఎవర్ని ఎలా నటింపజేయాలో తెలుసు. ఆయన పెద్ద మేథావి అని పొగడ్తలు కురిపించింది. ఇదిలావుండగా, నథాలియా అందాన్ని గురించి వర్మ ఇటీవలే తెగ పొగిడేస్తూ... ట్విట్టర్‌లో పెట్టడం... అది మీడియాకు పాకడం తెలిసిందే.

No comments:

Post a Comment