Friday, May 18, 2012

ఇరవై ఆరేళ్ళకే పెద్దయ్యానా.. అసిన్ ఆవేదన

హీరోల వయస్సు ఎంతైనా ఫర్వాలేదు. హీరోయిన్‌ మాత్రం కాలేజీ అమ్మాయిలా ఉండాలి...................... ఇది సినిమా రంగంలో ఉన్న చిత్రమైన పోకడ అంటూ నటి అసిన్‌ చమక్కులు పేలుతోంది. సహజంగా ఆడవారి వయస్సు చెప్పరు. కానీ అసిన్‌ ఇటీవలే తన వయస్సు ఇరవై ఆరేళ్ళని చెప్పింది. దాంతో బాలీవుడ్‌లో ఆమె చేస్తున్న చిత్రాలు చేయి దాటిపోయాయి.

ఈ అమ్మాయి చాలా ముదురు గురూ అంటూ..ప్రకాష్‌ ఝా దర్శకత్వంలో 'చక్రవ్యూహ్‌'లో అభిషేక్‌బచ్చన్‌ నటించే అవకాశాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఆ ప్లేస్‌లో అభయ్‌ డియోల్‌ను ఎంచుకున్నారు. అతని సరసన అసిన్‌ అక్కలా ఉంటుందని తీసేశారు. దీంతో చాలా ఇబ్బంది పడింది.

ఈ విషయాన్ని ఇంకా ఎక్కువసేపు ఆలోచించకూడదని ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఓ వాణిజ్య ప్రకటన కోసం వెనిస్‌ శైలి వాల్ట్‌డాన్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. దీనికి మంచి పారితోషికం రానుంది. దీంతో సినిమా ఎందుకంటూ ప్రశ్నిస్తోంది. అంతేకదా... అందని ద్రాక్ష పుల్లన అనే సామెత ఊరకనే చెప్పారా...

1 comment:

  1. పద్నాలుగేళ్ళకే చూపించడం మొదలు పెడితే ఇరవై ఆరేళ్ళకు పెద్ద కాక ఏమవుతారు?

    ReplyDelete