
ఇలాంటి వారు ఏదైనా శుభకార్యాలకు, సినిమాలకు, షికార్లతో పాటు.. నలుగురి మధ్యలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. దీంతో తమ వక్షోజాలను తిరిగి మునుపటిలా గట్టి పడే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. ఇందుకోసం నిపుణులైన వైద్యులను కూడా సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకుంటుంటారు.
ఇదే అంశంపై వైద్యులను సంప్రదిస్తే... సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత చాలామందికి వక్షోజాలు జారినట్లు కనిపిస్తాయని చెపుతున్నారు. దాన్ని మనసులో పెట్టుకుని మానసిక వేదనను అనుభవించడం సరికాదంటున్నారు.
కొన్ని రకాల బ్రాలు వక్షోజాలను పట్టి ఉంచి బిగుతుగా ఉన్నట్లు కనిపించేలా చేస్తాయని, వాటిని ధరించడమే ఉత్తమమని చెపుతున్నారు. అలాగే కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా కూడా వక్షోజాలను గట్టిగా ఉండేలా చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
No comments:
Post a Comment