![]() |
తమిళ
ఇండస్ట్రీలో తమిళ సినీ తంబీలు తారలపై చేస్తున్న ప్రచారం పక్కదోవ
పడుతున్నట్లుగా ఉంటోంది. ఇటీవలే పెళ్లి చేసుకుని చక్కగా కాపురం
చేసుకుంటున్న.................. నటి స్నేహ గురించి వారు రాసిన రాతలు తమిళనాడు వ్యాప్తంగా
పెద్ద చర్చనీయాంశమై కూర్చున్నాయి. నటి
స్నేహ - ఆమె భర్త ప్రసన్నలు విడిపోయారంటూ తాటికాయంత హెడ్డింగులు పెడుతూ
రాయడమే కాకుండా ప్రతి పత్రికలు అమ్మే షాపు వద్ద పెద్ద సైజు పోస్టర్లను సైతం
అంటించారు. ఇది నిజమేనా అనుకున్న చాలామంది లోపల మేటర్‌ను చూస్తే మరోలా
ఉంది.
అదేంటయా.. అంటే ఆషాఢమాసానికి స్నేహ తన పుట్టింటికి వెళ్లింది. కనుక అత్తవారింటిని...అంటే భర్తను విడిచి తన పుట్టింటికి వెళ్లింది. ఈ విషయాన్ని తంబీలు ఇలా రాసిపారేశారు. శుభం పలకరా పెళ్లికొడుకా అంటే.. ఏదో అన్నట్లుగా తమిళ సినీఇండస్ట్రీ తంబీల వాలకం ఉన్నదంటూ... ఇలాంటి రాతలు రాయడంపై కాస్తంత విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments:
Post a Comment