Thursday, July 12, 2012

సెక్స్‌కు లావుగా ఉండటానికి ఏమైనా లింకుందా?

చాలా మంది మహిళలు ఉండాల్సినలావు కంటే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారితో సెక్స్‌లో పాల్గొనాలంటే చాలా మంది పురుషులు........................ అనాసక్తత చూపుతుంటారు. మరికొంద మంది మహిళలు వివాహమైన తర్వాత లావుగా తయారవుతారు. వీరితో సెక్స్‌లో పాల్గొనేందుకు వారు భర్తలు కూడా పెద్దగా ఆసక్తి చూపరు. ఇది భార్యలను మనోవేదనకు గురి చేస్తుంది. లావుగా ఉండటం వల్ల సెక్స్‌కు ఏమైనా అవరోధం కలుగుతుందా అనే ఫీలింగ్ వారిని వేధిస్తూ ఉంటుంది.

ఇదే అంశంపై వైద్య నిపుణుల వద్ద ప్రస్తావిస్తే... వాస్తవానికి సెక్స్‌కి, లావుగా ఉండటానికి పెద్ద సంబంధం లేకపోయినట్లు అనిపించినా కొన్ని ఇబ్బందులు మాత్రం ఉంటాయంటున్నారు. లావుగా ఉండటం అది స్త్రీ అయినా, పురుషుడైనా పరస్పరం లైంగికాకర్షణ అవరోధంగా ఉండే అవకాశం ఉందని చెపుతున్నారు.

అలాగే, స్త్రీలు లావుగా ఉండటం వల్ల (బాగా లావు) అంగ ప్రవేశం కష్టంగా ఉంటుందని, పురుషులలో విపరీతమైన పొట్ట (బొజ్జ) ఉంటే శృంగారంలో పాల్గొన్నపుడు స్త్రీకి చాలా ఇబ్బందిని కలిగిస్తుందని చెపుతున్నారు. మొత్తానికి ఈ సమస్య వల్ల శృంగారంలో ఆనందానికి కొద్దిగా దూరమవుతారన్నది మాత్రం వాస్తవమంటున్నారు. పైగా.. సెక్స్‌లో పాల్గొంటే వెంటనే అలసటకు లోనవుతారని చెపుతున్నారు.

ఈ ఆందోళన వల్ల కొద్దిమంది భర్తలు మరింత ఎక్కువగా తిని, తాగడం వల్ల మరింత లావుకి లోనవుతారు. లావు అవడానికి అనేక కారణాలుంటాయని చెపుతున్నారు. ఇందులో మొదటిది వంశపారంపర్యం కావచ్చు లేదా ఎక్కువ తినడం వల్ల, వ్యాయామం చేయలేక, నడవలేక పోవటం కూడా కావచ్చని గుర్తు చేస్తున్నారు.

ఇలాంటి వారు... ఆరోగ్యం కోసం నూనె, కొవ్వు, బేకరీ పదార్థాలు, స్వీట్లు వంటివి తినడం మానేస్తే మంచిదని చెపుతున్నారు. కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ రోజూ పొట్ట తగ్గించే వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని సలహా ఇస్తున్నారు. వాటితో పాటుగా ప్రతి దినం ఉదయం, సాయంత్రం గంట సేపు వాకింగ్ చేయడం చాలా మంచిదని చెపుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల లావు సమస్య పరిష్కారమై శృంగారంలో హాయిగా పాల్గొనవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment