Tuesday, July 17, 2012

స్పర్శతో సరదాలు....సంభాషణల సరాగాలు!

Revealing Secrets Women
తన రహస్యాలన్నింటిలోకి మహిళ టాప్ గా కోరేది .....స్పర్శ మరియు కౌగిలింతలు. ఆ పని అయిందంటే పురుషుడు మరో మారు మహిళను స్పర్శించడు. కాని దాని తర్వాత కూడా ఆమె అతని ప్రేమను,.................
స్పర్శను కోరుకుంటుంది. రతి చేస్తే పురుషుడిలో ఎండార్ఫిన్ స్ధాయి చాలా పెరుగుతుంది. కోరిక తీరిందంటే చాలు తన తెలివి కోల్పోయి పూర్తిగా ఫ్లాట్ అయి నిద్రిస్తాడు. అయితే మహిళలలో ఈ రకమైన పరిస్ధితి చాలా నిదానంగా ఏర్పడుతుంది. దీనికిగాను మహిళ అతనికి తన పరిస్ధితి తెలుపాలి. ప్రత్యామ్నాయంగా కొద్ది నిమిషాలు అతనిని మీ ఒడిలో పడుకోమనండి. తర్వాత అతనిని బెడ్ పైకి మార్చాలి.
1. ఒక మంచి సంభాషణ ఆమెకు టానిక్ లా పని చేస్తుంది. మాటలు మొదలు పెడితే చాలు మహిళకు స్విచ్ ఆన్ చేసినట్లే. తాను ప్రేమించబడుతున్నానని ఆమెభావించటం ప్రధానం. నడకలో మీ సంభాషణ ఆమెకు మీ పట్ల కోరిక కలిగిస్తుంది. పురుషుడు తాను ఆమెను ఎంత వాంఛిస్తున్నాడో చెపితే చాలు ఇక ఆక్షణాల కొరకు ఎదురు చూస్తుంది.

2. చాలామంది మహిళలు ఎన్నో ఏళ్ళు వివాహ జీవితం గడిపి, తాను తన భాగస్వామికి తక్కువ ఆకర్షణతో వున్నానని భావిస్తారు. అందుకే చాలావరకు మహిళలు పూర్తి చీకటిలోగాని తమ దుస్తులు విప్పరు. పురుషులు ఇది గ్రహించాలి. ఆమె నిజంగా అద్భుతం కాకుంటే, ఆమెకు దానిపట్ల చెప్పాల్సిన అవసరం లేదు. ఆకర్షణగా వుండటానికి ఏం చేయాలో పరోక్షంగా తెలుపండి.

3. మహిళలకు రతి అనేది తమ జీవితంలో ఒక భాగం అది ప్రత్యేకమైనది కాదు. అయితే పురుషులు, రతి వేరు ప్రతి దినం గడిపే జీవితం వేరుగా భావిస్తారు. తృప్తికర రతిలో మహిళ రోజంతా ఆనందంగానే వుంటుంది. బెడ్ బయట తన ప్రేమికుడు ఎలా ప్రవర్తిస్తాడనే దానిపై ఆమె బెడ్ చర్యలు ఆధారపడివుంటాయి. అదే మెరుగైన భార్యా భర్తల సంబంధానికి దోవతీస్తుంది.

4. మీరు చూసే అశ్రద్ధ, కఠినపు మాటలు, కోపంకల స్వరధ్వని, గాయపడే మాటలు, విమర్శ మొదలైనవి ఆమెకు పడకలో ఏ మాత్రం ఉత్సాహాన్ని, అనుభూతిని చూపలేవు.
5. ఆమెకు భావప్రాప్తి ప్రధానం కాదు. సన్నిహిత్వం చాలు ఆమెకు. కొన్నిసార్లు మహిళలు తమ భావప్రాప్తి కంటే మీరు చేసే ఫోర్ ప్లే కు స్పర్శలకు చాలా సంతోషిస్తారు.

6. మహిళకు శారీరక కోర్కె అనేది ఒక సీరియస్ విషయం కాదు. ఆమెకు కావలసిందల్లా మీ స్పర్శ, సమయం. కాని పురుషులు దాని పట్ల సీరియస్ గా ప్రవర్తిస్తారు. కనీసం అల్లరి, నవ్వులు వంటివికూడా వుండవు. ఆటలు, పాటలు వంటివి ఆమెకు ఆనందంతో కూడిన రిలాక్సేషన్ ఇస్తాయి.

7. మహిళకు ప్రేమ, రొమాన్స్, కౌగిలింతలు, చేయిపట్టి ముద్దాడడం వంటివి కావాలి. చాలామంది మహిళలు ఫోర్ ప్లే లో తప్ప విడిసమయాలలో పురుషులు వీటిని ఆచరించరని ఫిర్యాదు చేస్తారు. కనుక మహిళ స్పర్శలో వున్న ఆనందం పురుషుడికి చూపాలి. రతి రహిత స్పర్శలు, ప్రేమ అతనికి రుచి చూపి అవి కావాలని కోరాలి.

No comments:

Post a Comment