Wednesday, July 18, 2012

లేటు వయస్సులో జీవిత మాధుర్యం పొందాలంటే...!

romance
కుర్రవాడైనా ఉద్వేగం లేకపోతే ముసలివాడుగా మారుతాడు. ముసలివాడైనా హుషారైన మనస్సు కలిగి................... ఉంటే కుర్రవానిలాగా మారిపోతాడు. కోడెదూడలాగా మనస్సు రంకెలేసి గంతులేస్తుంది. చాలామంది 40 - 50 సంవత్సరాలు వచ్చేసరికి సెక్స్‌లో డల్‌గా మారుతారు. వారి జీవితాన్ని యాంత్రికంగా చేసుకోవడమే ఇందుకు కారణం.

దాంపత్య జీవితంలో కూడా కొత్తదనాల్ని నింపుకోలేక పోవడం మరో కారణం. రోజూ తినే కూర అయినా రోజుకొక రుచిగా చేసుకుంటే ఎప్పటికీ మొహం మొత్తదు. సెక్స్‌ విషయంలో కూడా ఆ నేర్పు ఉండాలి. ఆ ఊపు ఉండాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం అనేది మనిషి చేతిలోనే ఉంది. దిగులుతో, బాధతో కుమిలిపోయే మనిషికి ఇరవైలోనే 60 వచ్చేస్తుంది. అలాగాకుండా కష్టాల్ని తేలికగా, సమస్యలను చాకచక్యంగా పరిష్కరించే వ్యక్తిలో 60 వచ్చినా 20 లాగానే ఉంటారు.

కొందరు దంపతులు పరస్పరం సహకరించుకుంటూ, అర్థం చేసుకుంటూ జీవనయానం సాగిస్తుంటారు. శృంగారానికి తగిన చోటు కల్పిస్తుంటారు. అటువంటి వారిలో 60 లేదా 70 వచ్చినా జీవితం ఆనందంగా రూపుదిద్దుకునే ఉంటుంది. లేటు వయస్సులో కూడా ఘాటు ప్రేమ చోటు చేసుకునే ఉంటుంది.

No comments:

Post a Comment