యువత
అంటే ఎనర్జీగా ఉంటారు. అటువంటి యువత నేడు ఎనర్జీ డ్రింక్స్ పేరుతో
విషాన్ని తాగుతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇండియన్ హెల్త్
ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఇండియాలో............. 1500 కోట్ల రూపాయలకు పైగా
మార్కెట్‌లోకి ఈ డ్రింక్‌లు వచ్చాయి. ముఖ్యంగా పబ్‌ల్లోనూ, పెద్దపెద్ద
పార్టీల్లోనూ ఇవి రాజ్యమేలుతున్నాయి. ఇటీవలే ఇది సినిమా రంగానికి పాకింది.
ఆడియో ఫంక్షన్లలో, ప్లాటినం డిస్క్ వేడుకల్లోనూ, నిర్మాత, దర్శకుడు, హీరో పుట్టినరోజుల ఫంక్షన్లలో ఇవి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని విదేశీ బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో రెడ్‌బుల్‌ను సినిమా రంగానికి చెందిన కొంతమంది మార్కెట్ చేయడం విశేషం. పబ్‌లో అయితే ఏకంగా రెడ్ బుల్ టాటూన్స్‌ను జాకెట్ వేసుకుని అందగత్తెలు డాన్స్‌లు కూడా చేస్తున్నారు. ఇటీవలే జూబ్లీహిల్స్‌లో రోడ్ నెం.12లో పట్టుబడినట్లు పలు విషయాలు బయటపడ్డాయి.
డ్రింక్ దేనితో తయారవుతుంది...
ఎనర్జీ డ్రింక్ కూడా సాఫ్ట్‌డ్రింక్ లాంటిదే. కాకపోతే ఎక్కువ ఎనర్జీ ఉండేలా.. కెఫిన్, గౌరానా, గ్లుకురోనోలాక్టోస్, బి విటమిన్, పంచదార వంటివి ప్రధానంగా కన్పిస్తాయి. ఇవి తాగగానే ఎనర్జీ అందుతుంది. సాయంత్రం తాగితే రాత్రుళ్ళు ఎక్కువ సమయం నిద్రపట్టదు. అలసట తెలీదు. ముఖ్యంగా జిమ్‌ల్లోనూ ఇవి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్‌లలో ఇవి దర్శనమిస్తుంటాయి.
మనదేశంలో నిబద్ధతలేదు
విదేశాల్లో పోల్చుకుంటే మనదేశంలోని వాతావరణానికి సరైనవి కావని డాక్టర్లు చెబుతున్నారు. ఇండియాలో ఎనర్జీడ్రింక్‌కు సంబంధించి ప్రమాణాలు లేవని నిపుణులు అంటున్నారు. పీఎఫ్‌ఎ నిబంధన ప్రకారం (1955) కొర్పోనేటెడ్ వాటర్ స్టాండర్డ్స్‌లో కెఫిన్ అత్యధికంగా 200 పీపీఎం ఉండొచ్చని చెప్పింది. సెంటర్ ఫుడ్ కమిటీ ఇచ్చిన సూచన మేరకు కెఫిన్ పరిమాణం 145 పీపీఎంకు తగ్గించారు. దేశంలో రమారమి 80 నుంచి 250 ఎంజీ కెఫిన్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇవి తీసుకోవడం వల్ల ఒక్కసారిగా హార్ట్ రేట్ పెరగడం జరుగుతుంది.
దేశంలో
అమ్ముతున్న ఎనర్జీ డ్రింక్స్‌లో ఎక్కువశాతం ప్రమాదకర స్థాయిలో కెఫిన్
ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే సంస్థ ఆధారలతో సహా
ప్రకటించింది. ప్రభుత్వం అనుమతించిన 145 పిపిఎం కెఫిన్‌ను దాటి ఆయా సంస్థల
డ్రింక్‌లు ఉన్నాయని సంస్థ పేర్కొంది.
కోలాలపై నిషేధం
గతంలో కోకోకోలా డ్రింక్‌ను బాగా ఆదరించేవారు. కానీ పరిస్థితుల రీత్యా దాన్ని నిషేధించాల్సి వచ్చిందనే విషయాన్ని ఆ సంస్థ గుర్తు చేసింది.
డాక్టర్లు ఏమంటున్నారు ?
ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం అంతమంచిది కాదని గ్లోబల్ ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ రామకృష్ణ తెలియజేశారు. వ్యాయామాలు చేసేవారు ఇవి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి, ఒబెసిటీ కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆల్కహాల్‌తో కలిపి దీన్ని తీసుకుంటే దీనివల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది కానీ... ఆరోగ్య సమస్యలు వచ్చి నరాలు చచ్చుబడిపోయే ప్రమాదముందని గట్టిగా చెబుతున్నారు. కనుక... యూత్ తస్మాత్ జాగ్రత్త.
ఆడియో ఫంక్షన్లలో, ప్లాటినం డిస్క్ వేడుకల్లోనూ, నిర్మాత, దర్శకుడు, హీరో పుట్టినరోజుల ఫంక్షన్లలో ఇవి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని విదేశీ బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో రెడ్‌బుల్‌ను సినిమా రంగానికి చెందిన కొంతమంది మార్కెట్ చేయడం విశేషం. పబ్‌లో అయితే ఏకంగా రెడ్ బుల్ టాటూన్స్‌ను జాకెట్ వేసుకుని అందగత్తెలు డాన్స్‌లు కూడా చేస్తున్నారు. ఇటీవలే జూబ్లీహిల్స్‌లో రోడ్ నెం.12లో పట్టుబడినట్లు పలు విషయాలు బయటపడ్డాయి.
డ్రింక్ దేనితో తయారవుతుంది...
ఎనర్జీ డ్రింక్ కూడా సాఫ్ట్‌డ్రింక్ లాంటిదే. కాకపోతే ఎక్కువ ఎనర్జీ ఉండేలా.. కెఫిన్, గౌరానా, గ్లుకురోనోలాక్టోస్, బి విటమిన్, పంచదార వంటివి ప్రధానంగా కన్పిస్తాయి. ఇవి తాగగానే ఎనర్జీ అందుతుంది. సాయంత్రం తాగితే రాత్రుళ్ళు ఎక్కువ సమయం నిద్రపట్టదు. అలసట తెలీదు. ముఖ్యంగా జిమ్‌ల్లోనూ ఇవి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్‌లలో ఇవి దర్శనమిస్తుంటాయి.
మనదేశంలో నిబద్ధతలేదు
విదేశాల్లో పోల్చుకుంటే మనదేశంలోని వాతావరణానికి సరైనవి కావని డాక్టర్లు చెబుతున్నారు. ఇండియాలో ఎనర్జీడ్రింక్‌కు సంబంధించి ప్రమాణాలు లేవని నిపుణులు అంటున్నారు. పీఎఫ్‌ఎ నిబంధన ప్రకారం (1955) కొర్పోనేటెడ్ వాటర్ స్టాండర్డ్స్‌లో కెఫిన్ అత్యధికంగా 200 పీపీఎం ఉండొచ్చని చెప్పింది. సెంటర్ ఫుడ్ కమిటీ ఇచ్చిన సూచన మేరకు కెఫిన్ పరిమాణం 145 పీపీఎంకు తగ్గించారు. దేశంలో రమారమి 80 నుంచి 250 ఎంజీ కెఫిన్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇవి తీసుకోవడం వల్ల ఒక్కసారిగా హార్ట్ రేట్ పెరగడం జరుగుతుంది.

కోలాలపై నిషేధం
గతంలో కోకోకోలా డ్రింక్‌ను బాగా ఆదరించేవారు. కానీ పరిస్థితుల రీత్యా దాన్ని నిషేధించాల్సి వచ్చిందనే విషయాన్ని ఆ సంస్థ గుర్తు చేసింది.
డాక్టర్లు ఏమంటున్నారు ?
ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం అంతమంచిది కాదని గ్లోబల్ ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ రామకృష్ణ తెలియజేశారు. వ్యాయామాలు చేసేవారు ఇవి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి, ఒబెసిటీ కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆల్కహాల్‌తో కలిపి దీన్ని తీసుకుంటే దీనివల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది కానీ... ఆరోగ్య సమస్యలు వచ్చి నరాలు చచ్చుబడిపోయే ప్రమాదముందని గట్టిగా చెబుతున్నారు. కనుక... యూత్ తస్మాత్ జాగ్రత్త.
No comments:
Post a Comment