ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి లక్షలాది మంది ప్రజలు సూక్ష్మ వాణిజ్య వేత్తలుగా పనిచేస్తూ ఉంటారని ప్రస్తుత పరిస్థితులను బట్టి వేసిన నిపుణుల అంచనాలో తేలింది. స్థానిక వాతావరణానికి తగిన వ్యవస్థలు ఎక్కడికక్కడ రూపొందుతాయి. వాటిలో
పైన పేర్కన్న లక్షలాదిమంది భాగస్వాములుగా ఉంటారు. పూర్తి సమయం పనిచేసే కార్మికులు, తాత్కాలికంగా ప్రాజెక్టు పనిచేసే కార్మికుల మధ్య సరిహద్దులు చెరిగిపోయే వాతావరణం ఉంటుంది. అంట ేవారు వీరయ్యే వెసులుబాటు కలగవచ్చు.
కొత్త సాంకేతిక మార్పులు
సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి కొత్తకొత్త రంగాలు తెరుచుకుని 2025 నాటికి పని ప్రపంచంలో అనేక మార్పులు రావచ్చని నిపుణులు ఊహిస్త్తున్నారు. స్థానిక వాతావరణానికి తగిన విధంగా చిన్న చిన్న ఇకో సిస్టమ్స్ అన్ని రంగాలలో అభివృద్ధ్ది చెందుతాయి. ఈ వాతావరణంలోంచి గ్లోబల్ మెగా కంపెనీలు వృద్ధి చెందవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. కోట్ల మంది కస్టమర్లకోసం ఉద్దే శించిన పథకాలలో లక్షల మంది పనిచేసే విధంగా అంగబలం రూపొందవచ్చు.
సమాన స్థాయి అధికార గణం
నిలువుగా, పిరమిడ్ తరహా అధికార గణం పోయి అడ్డంగా అంటే హెచ్చుతగ్గులు లేని సమాన స్థాయిల్లో అధికార గణం ఉంటుంది. వారి మధ్య విరివిగా సమన్వయం ఉండేలా సాంకేతిక అభివృద్ధి చోటుచేసుకుంటుంది. జిఎన్‌యు- లైనుక్స్ మీద ఓపెన్ సౌర్స్ కోడ్ వినియోగించి పనిచేసే వందలాది మందితో ఈ వ్యవస్థ మమేకం కావడాన్ని మనం చూస్తాం. ప్రపంచస్థాయి సమాచార వ్యవస్థ ఏర్పడడానికి వికీపీడియాలో ఇప్పుడున్న సమన్వయ వ్యవస్థ వంటిది విస్త ృత స్థాయిలో ఏర్పడుతుంది. 1950ల నుంచి జపాన్, సిలికాన్ వ్యాలీలు అభివృద్ధికి మారుపేరుగా నిలవడానికి గాను లాబ్‌ల అబివృద్ధి అక్కడ విరివిగా జరిగింది. బహుళ జాతి కంపెనీలు ఉద్ధేశ పూర్వకంగా వాటిని తమ దేశాలలోనే ఏర్పాటు చేసుకున్నాయి. నూతనంగాఆవిష్కతమయ్యే ఆర్థిక వ్యవస్థలలో స్థానిక స్థాయిలలో గుత్తులుగుత్తులుగా ఇకోవ్యవస్థలు ఏర్పడతాయని నిపుణులు ఊహిస్తున్నారు.
No comments:
Post a Comment