Tuesday, September 24, 2013

శరీరానికి ఎక్కువ పరిమాణంలో జింక్

 జింక్ అనేది ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ఒక క్రమ పద్ధతిలో ప్రజలకు అవసరమైన ఖనిజం. శరీరానికి ఎక్కువ పరిమాణంలో జింక్ అవసరం లేనప్పటికీ తగినంత మోతాదులో అవసరం ఉంటుంది. జింక్ తగినంత మోతాదులో లేకపోతె తీవ్రమైన మరియు చెడు ప్రభావాలు కలుగుతాయి. జుట్టు కోల్పోవడం,రుచి లేదా వాసన కోల్పోవడం,గాయాలకు స్వస్థత లేకుండుట వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. జింక్ 300 ఎంజైమ్ ల నిర్మాణాలలో పాలుపంచుకుంటుంది. వందల కొద్దీ శరీర ప్రక్రియల సరైన పనితీరులో సహాయపడుతుంది. DNA ఉత్పత్తి చేసే కణాలను మరమత్తు చేయడానికి సహాయపడుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఖనిజం. రాత్రి పూట నిద్ర బాగా పట్టటానికి సహాయపడుతుంది. ఉదయం పూట మంచి శక్తి స్థాయిలను మరియు బరువు కోల్పోయే ప్రక్రియను వేగవంతం చేయటం వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. జింక్ అనారోగ్యంతో పోరాడటానికి, అలాగే ఆరోగ్యకరమైన కణ పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడటం,రోగనిరోధక పనితీరు ప్రోత్సహించటం వంటి ఇతర ముఖ్యమైన విధులను కలిగి ఉంటుంది. జింక్ ముఖ్యంగా పురుషులకు అవసరం. ఎందుకంటే సాధారణంగా ప్రోస్టేట్ ఆరోగ్యం,టెస్టోస్టెరాన్ స్థాయిలు, లైంగిక ఆరోగ్య నిర్వహణ దాని పనితీరుకు అవసరం అవుతుంది. మీరు జింక్ ను ప్రతి రోజు తగినంత మోతాదులో సులభంగా పొందవచ్చు. ఎరుపు మాంసం,చిక్కుళ్ళు,పాల ఉత్పత్తులు చికెన్,సముద్రపు ఆహారం మరియు నట్స్ లలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు జింక్ యొక్క 20 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము.
కణాల విభజన గర్భధారణ సమయంలో పెరుగుతున్న పిండం కోసం కణాలను వేగంగా విభజించడం చాలా ముఖ్యం. మీ సాధారణ ఆహారంలోకి జింక్ చొప్పించడం ద్వారా పిండం అభివృద్ధి కణాల విభజన ఏ అవాంతరాలు లేకుండా సజావుగా సాగుతుంది.


No comments:

Post a Comment