Tuesday, September 24, 2013

'వందేళ్ల వేడుకల'కు హాజరైన రాష్ట్రపతి

చెన్నయ్ లో జరుగుతున్న వందేళ్ల దక్షిణ భారత వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరి రోజైన మంగళవారం ఈ వేడుకలకు
ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. వందేళ్ల భారత సినిమా ఉత్సవాల సందర్భంగా ఆయన సినీ రంగానికి ప్రముఖులు, అలనాటి మహానుభావులు చేసిన సేవను ఆయన కొనియాడారు. చెన్నయ్ లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ వేడుకలు ఈ నెల 21నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చివరి రోజు వేడుకల్లో రాష్ట్రపతితో పాటు తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, నాలుగు ఇండస్ట్రీల సినీ ప్రముఖులు, నటులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment