తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్టు, నేను తయారు చేసిన కారుకు మూడే
చక్రాలు అంటున్నాడీ ఈ అమెరికా బుల్లోడు. అమెరికాకు చెందిన పాల్ ఎలియో ఈ
మూడు చక్రాల కారును సృష్టించాడు. తన పేరుతోనే ఈ కారుకు 'ఎలియో' (Elio) అనే
పేరును పెట్టాడు. పెరుగుతున్న ఇంధన ధరలు, నానాటికీ అధికమవుతున్న వాహనాల
సంఖ్యతో రోడ్లపై అలాగే పార్కింగ్ ప్రదేశాల్లో తగ్గుతున్న స్థలం తదితర
అంశాలను దృష్టిలో ఉంచుకొని పాల్ ఎలియో ఈ కారును తయారు చేశాడు.
ఎలియో టూ సీటర్ కారు. ఇందులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. అందులో ఒక
డ్రైవర సీట్, దానికి వెనుకన మరొక ప్యాసింజర్ సీటు ఉంటాయి. ఇది సాంప్రదాయ
కార్ల మాదిరిగానే స్టీరింగ్, బ్రేక్స్, క్లచ్ పెడల్స్, ట్రాన్సిమిషన్ వంటి
అన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో ఇన్‌లైన్ 3-సిలిండర్, 1-లీటర్, 70 హార్స్
పవర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్
ఉంటుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో
లభ్యమవుతుంది. ఇందులో రివర్స్ గేర్ కూడా ఉంటుంది.
No comments:
Post a Comment