'గ్రీక్ శిల్పం'లా ఉండే 'హృతిక్ రోషన్'ను ఇష్టపడని వారు ఉండరు. హృతిక్
వ్యక్తిగత జీవితంపై ప్రస్తుతం కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి. హృతిక్,
అతని భార్య సుస్సానే విడిపోతున్నారని బాలీవుడ్ లో వార్తలు షికారు
చేస్తున్నాయి. అయితే వీరు వీడిపోవడానికి కారణాలు మాత్రం సినీవర్గాలకు
ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
అయితే రీసెంట్ గా హృతిక్ తన తండ్రి 'రాకేశ్ రోషన్' పుట్టిన రోజును ముంబాయి
లో అత్యంత ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకకు హృతిక్ భార్య 'సుస్సానే' చాలా
ఆలస్యంగా రావడంతో హృతిక్ కోపానికి గురయ్యాడట. దీంతో ఆ పార్టీలోనే హృతిక్
ఆమెపై చిందులు వేశాడట. దీనితో షాక్ కు గురైన 'సుస్సానే' తన తల్లి తండ్రులకు
హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ సరైన మర్యాద ఇవ్వడంలేదని విసురుగా సమాధానం
చెప్పి ఆ పార్టీ నుండి వెంటనే వెళ్లిపోయిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు
వారి తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉంటుందట. ఇలా వీరి మధ్య సంబంధం కాస్త
దూరమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య
చిచ్చుపెట్టిన రాకేశ్ బర్త్ డే పార్టీ పై చాలామంది రకరకాల కమెంట్స్
చేస్తున్నారు. తండ్రి బర్త్ డే కానుకగా భార్యకు విడాకులిస్తున్నాడంటూ
సెటైర్స్ కూడా వేస్తున్నారు బాలీవుడ్ సినీ విమర్శకులు. మరి దీనిలో నిజం
ఎంతో వేచి చూడాలి.
No comments:
Post a Comment