వందేళ్ల సినిమా వేడుకల్లో తెలుగుకు అవమానం జరిగిందని విప్లవ హీరో ఆర్
నారాయణ మూర్తి విమర్శించారు. చెన్నయ్‌లో జరుగుతోన్న వందేళ్ళ సినీ పరిశ్రమ
వేడుకలు ఒక సినిమా
ఆడియో ఫంక్షన్‌లా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ
వేడుకల్లో ఆదివారం తెలుగు పరిశ్రమ ఉత్సవాలు జరిగాయి. దీనిలో భాగంగా వేదికపై
మాట్లాడుతున్న మూర్తిని నిర్మాత సి.కళ్యాణ్ మైక్ లాగేసుకొని అవమానపరిశాడు.
దీంతో అవమానానికి గురయిన నారాయణ మూర్తి నిర్వహకులపై తీరును విమర్శించారు. ఈ
వేడుకలు తెలుగు చిత్ర పరిశ్రమకు అవమాన పరిచేలా ఉన్నాయన్నారు. అలనాటి
మహానుభావులు ఎందరో సినీ పరిశ్రమకు ఎంతో కృషి చేసినా వారి స్మృతులను
స్మరించుకోవడం లేదన్నారు. తెలుగు సినీ రంగానికి సేవ చేసిన ఎన్టీఆర్ లాంటి
వారు చాలా మంది ఉన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు ఉత్సవాల్లో
తెలుగు ప్రముఖుల సన్మానించకుండా.. ఇతర భాషాల వారిని సన్మానించడాన్ని ఆయన
తప్పుపట్టారు. ఇది తెలుగుకు తీరని లోటన్నారు. సినిమాకు ఎంతో సేవ చేసిన
రఘుపతి వెంకయ్య నాయుడు పేరును ఈ వేడుకల ప్రాంగణానికి పెట్టాలన్నారు. తెలుగు
సినిమా చరిత్రలో ఎంతో అనుభవజ్ఞులైన దాసరి, కె.విశ్వనాథ్, రాఘవేంద్రరావు,
రామానాయుడు వంటి వారికి సరైన గౌరవం ఇవ్వలేదన్నారు.
No comments:
Post a Comment