
భోజనానికి అరగంట ముందుగా పెరుగును ఫ్రిజ్‌లో నుంచి తీసి బయటపెట్టాలి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన వెంటనే
పెరుగును తినడం మంచిది కాదు.
పుల్లని పెరుగు కంటే తియ్యని పెరుగే ఆరోగ్యానికి మంచిది.
ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుతుంది.
గేదె పెరుగుకు కఫాన్ని పెంచే గుణముంది. అందువల్ల రాత్రి సమయంలో గేదె పెరుగును వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. పెరుగును చిలికి, చిక్కటి మజ్జిగను పోసుకోవాలి.
వాతాన్ని హరిస్తుంది.
శరీరంలోని విషకరమైన బ్యాక్టీరియాలను నశింపజేసే శక్తి పెరుగుకు ఉంది.
విరేచనాలను అరికడుతుంది.
పెరుగులో బి6, బి12, ఫోలిక్ యాసిడ్‌లు లభిస్తాయి. అంతేకాకుండా కాల్షియం, ఫాస్పరస్ కూడా లభిస్తాయి.
మూత్ర సంబంధిత అనారోగ్యాలకు ఔషధంలా పనిచేస్తుంది.
పెరుగులో పంచదారను కలుపుకుని తింటే, శరీరంలోని అధిక వేడిని తొలగించి, చలువ చేస్తుంది.
నిద్రపట్టని వారు పెరుగుకానీ, చిక్కటి మజ్జిగకానీ తాగితే సుఖనిద్ర పడుతుంది.
ఆవు పెరుగు ఆకలిని పెంచుతుంది.
పెరుగులో ఉప్పు, శొంఠిపొడి కలిపి అన్నంలో కలుపుకుని తింటే, అజీర్తి ఏర్పడదు.
మేక పెరుగు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మేక పాలు, పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆవు పెరుగు టైఫాయిడ్, పైల్స్ వ్యాధులను నివారిస్తుంది.
పెరుగుదలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
పెరుగును కొంచెం తీస్తే అందులో వచ్చే నీరు దాహాన్ని తగ్గిస్తుంది.
No comments:
Post a Comment