వరుస ఫ్లాపులతో డీలా పడుతున్న రవికి 'బలుపు' మంచి హిట్ ఇచ్చిన సినిమా. చాలా
రోజుల తర్వాత విజయాన్ని అందుకోవడంతో రవితేజ కొత్త సినిమాలకు ప్లాన్
చేస్తున్నాడు. 'బలుపు' సినిమాకి కథను అందించిన 'బాబీ' దర్శకత్వంలో
నటించాలని నిర్ణయించుకున్నాడట. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధంగా ఉందని
తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఇప్పుడు వేట సాగిస్తున్నాడట మన
మాస్ మహారాజా. అయితే రీసెంట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా 'హన్సిక'
నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. కానీ అనుష్క పై రవి కన్ను పడిందట. ఇంతకు
ముందే 'విక్రమార్కుడు'తో హిట్ కొట్టిన ఈ జంట మరోసారి సక్సెస్ కొట్టాలని
ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు 'హన్సిక' కంటే 'అనుష్క'
బెటర్ అని చిత్ర యూనిట్ కూడా డిసైడ్ అయ్యిందట. అయితే అనుష్క ఇప్పటికే
రాజమౌలీ డైరెక్షన్ లో ప్రభాస్ సరసన ' బాహుబలి' సినిమాలో.. అదే విధంగా
'రుద్రమదేవి' లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. మరి ఇంత బిజీగా ఉన్న ఈ
బ్యూటీ ఈ సినిమాకు ఒప్పుకుంటుందో.. లేదో.. చూడాలి.
No comments:
Post a Comment