ఏ సినిమాకైనా.. స్టోరీ బాగుంటే పైరసీలు ఏం చేయలేవని అని నిర్మాత సురేష్ బాబు అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేదీ' సినిమా పైరసీ సిడిలు వెలువడి రాష్ట్రంలో సంచలనం సృష్టించడంతో చెన్నయ్ లో ఉన్న ఆయన
స్పందించారు. ఇలాంటి విషయాల్లో నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సినిమా ఎప్పుడు విడుదల చేయాలనేది కూడా ఆ చిత్రం దర్శకనిర్మాతల నిర్ణయంపై ఆధార పడుతుందన్నారు. ఏళ్లతరబడి తెలుగు సినిమా పైరసీ పై పోరాటం చేస్తూనే ఉందని, కొందరు స్టార్ హీరోలు తమ సినిమాలు వచ్చినప్పుడే హడావిడీ చేసి ఆ తర్వాత లైట్ తీసుకుంటుందన్నారు.
No comments:
Post a Comment