మద్రాసు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
(ఐఐటి)లోని ఇద్దరు తెలుగు విద్యార్థులు, ఒక తమిళ విద్యార్థికి గూగుల్ సంస్థ
అరుదైన గౌరవాన్నిచ్చింది. ఇంటర్న్ ప్రాజెక్టు కింద వీరికి సంవత్సరానికి
రూ.92 లక్షల జీతాన్ని గూగుల్ సంస్థ ఆఫర్ చేసింది. ప్రాజెక్టు ముగిసిన
అనంతరం వీరికి తమ సంస్థలో మరింత అధిక జీతంతో ఉన్నత స్థానం కల్పిస్తామని
పేర్కొంది.
ప్రోగ్రామింగ్ లో ఈ ముగ్గురు విద్యార్థులు చూపిన ప్రతిభను గుర్తించి గూగుల్ సంస్థ వీరిని ఆహ్వానించింది.
సోమవారం గూగుల్ నుండి తమకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందాయని ఈ సందర్భంగా
విద్యార్థులు తెలిపారు. మూడు నెలల పాటు బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో
ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు.
గూగుల్ గౌరవాన్ని పొందిన వారిలో.. గురుప్రక్షా, ఎన్.సంతోష్ కుమార్ మన
రాష్ట్రానికి చెందిన వారు కాగా, కెవిన్ కార్తీక్ తమిళనాడుకు చెందిన
వ్యక్తి.
No comments:
Post a Comment