Wednesday, September 25, 2013

స్టైలిష్ స్టార్ 'పండగ చేసుకో'వాలట!

అల్లు అర్జున్ .. స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఎనర్జిటిక్ హీరో బన్నిని రామయ్యా వస్తావయ్యా డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్ చేస్తున్నాడట. ఏంటా కామెంట్ అనా..
అల్టు అర్జున్ ఎక్కడా కలిసినా.. 'పండగ చేస్కో.. పండగ చేస్కో' అంటున్నాడట. అయితే దీనికి బన్ని మాత్రం ముందు 'రామయ్య'ను రిలీజ్ వరకు ఆగమన్నాడని టాక్. పండగ ఎంటీ.. ఆగడమేంటని అనుకుంటున్నారా.. అసలు విషయంలోకి వెళితే.. బన్ని హీరోగా ఓ కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట హరీష్ శంకర్. ఈ సినిమాకు 'పండగ చేసుకో' అనే టైటిల్ పెట్టే యోచనలో ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ 'రేసుగుర్రం' సినిమాతో బిజీగా ఉన్నాడు. అతనితో సినిమా చేసేందుకు ఇప్పటికే చాలామంది దర్శకులు లైన్లో ఉన్నారు. ఆ లైన్లో హరీష్ శంకర్ కూడా ఉన్నాడు. హరీష్ చెప్పిన స్టోరీ బన్నికి బాగా నచ్చిందట. కానీ ఒకవేళ రామయ్యా వస్తావయ్యా సూపర్ హిట్ అయితే వెంటనే డేట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అంటే ఎన్టీర్ 'రామయ్య' హిట్ పైనే ఈ బన్ని 'పండగ' చేయాలో వద్దో తేల్చుకోబోతున్నాడు.. సో.. రామయ్యా హిట్ అవుతుందా.. బన్ని పండగ చేసుకుంటాడా అనేది వేచి చూడాలి.

No comments:

Post a Comment