Thursday, September 26, 2013

'అపరిచితుడు' ఫామ్ లోకి వస్తాడా..?

ప్రయోగాలకు మారుపేరు విక్రమ్. సినిమా ఏదైనా.. దానిలో తనకుంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడం ఆయన స్టైల్ . పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం విక్రమ్ కు వెన్నతో పెట్టిన విద్య. 'అపరిచితుడు', 'మల్లన్న', 'నాన్న' వంటి సినిమాలు తీసిన విక్రమ్
ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తమిళంలో 'ఐ' అనే సినిమాలో నటిస్తున్నాడట. ఈచిత్రంలో విక్రమ్ సరసన 'అమీ జాక్సన్' నటిస్తుండగా.. ఎ.ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. 'ఐ' చిత్ర షూటింగ్ గత ఏడాది నుంచి జరుగుతోంది. అయితే ఈసినిమాలో వైవిధ్యం కోసం ఏకంగా విక్రమ్ గుండు కొట్టించాడు. అంతే కాదు 15కేజీలు కూడా తగ్గినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. చెన్నయ్ లో జరిగిన వందేళ్ల వేడుకల్లో కూడా గుండుతోనే కనిపించి అందరిని అశ్చర్యానికి గురిచేశాడు. తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు 15భాషాల్లో డబ్బింగ్ అవుతోంది. 'మనోహర' పేరుతో తెలుగులో విడుదల కానుంది. మరి ఈ వైవిధ్య భరిత చిత్రాలు తీస్తున్న విక్రమ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

No comments:

Post a Comment