సినిమా ఏదైనా.. ప్రేక్షకులకు కావాల్సింది.. స్టోరీ, ఎంటర్ టైన్ మెంట్ , కాసింత మెసేజ్. ఇది ఆనాటి నుంచి నేటి వరకు సగటు ప్రేక్షకుల్లో ఉన్న ఆలోచన. అయితే కాలం మారింది. సినిమా ఇండస్ట్రీ కూడా భారీగా మార్పు చెందుతూ వస్తోంది. ప్రేక్షకుడు
కూడా కొత్తదనంతో యూత్ అభిమానులు ఉండడం వల్ల కాస్త రొమాన్స్ ను కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు రొమాన్స్ నే ప్రధానంగా చేసుకొని సినిమాలు తీస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ కోవలో చాలా వరకు చిన్న సినిమాలే ఉంటున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలు యాక్షన్, మాస్ ఓరియెంటెడ్ గా ఉంటాయి. ఎక్కువమందిని ప్రభావితం చేస్తాయి. వీటిలో క్రియేటివిటి కంటే హీరోకు.. యాక్షన్ కు ప్రాధాన్యతనిస్తారు. కానీ చిన్న సినిమాలలో ఎక్కువగా కొత్తదనంతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈచిత్రాలు మార్కెట్ లోకి సైలెంట్ గా వచ్చి సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఇలా వచ్చిన సినిమాలు మన ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయితే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు చిన్న చిత్రాలకు థియేటర్ల బెడద ఉంటుంది. ఒక్క స్టార్ హీరో సినిమా వచ్చిందంటే.. ఇక చిన్న సినిమాలు అడ్రస్ గల్లంతయినట్లే .
అయితే రీసెంట్ గా రాష్ట్రంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. గత రెండు నెలలుగా 'తుఫాన్'మినహా పెద్ద సినిమాలు ఒక్కటి కూడా రాకపోవడంతో చిన్న చిత్రాల హవా నడిచింది. ఇప్పటివరకు థియేటర్ల కొరతతో ఇబ్బంది పడ్డా చిత్రాలని విడుదలయ్యాయి. ఒక్క శుక్రవారంలో ఐదు నుంచి పది వరకు సినిమాలు రిలీజ్ అయి తమ జాతకాన్ని పరీక్షించుకున్నాయి. అయితే ఈ సినిమాల్లో రెండూ మూడు తప్ప మిగతా ఏసినిమా సరైన హిట్ సాధించలేకపోయాయి. అవకాశం వచ్చినా.. ఉపయోగించుకోలేకపోయాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. థియేటర్ల వద్ద బొక్కా.. బోర్లా పడ్డాయి. ఇప్పటి వరకు థియేటర్లు లేవని సాకులు చెబుతూ.. వస్తోన్న చిన్న సినిమా దర్శకనిర్మాతలు.. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారు..?
'కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ చాలు' అన్న పవన్ డైలాగ్ కరెక్ట్ గా చిన్న సినిమాలకు వర్తిస్తుంది. ఈ కంటెంట్ లేకనే చిన్న చిత్రాలు సత్తా చాటలేక పోయింది. థియేటర్లు ఖాళీగా ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాయి. ఇన్నాళ్ళు తమకు పెద్ద నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు తొక్కి పెడుతున్నారనే మాటల్లో వాస్తవం లేదని తేలిపోయింది.
కథా, కథనం లేదు...
చిన్న సినిమాల్లో లో డ్రెస్ హీరోయిన్స్ ...క్రేజీ హీరోస్.. అంతా న్యూ బ్రాండ్ ... అందరు సింగిల్ సినిమా స్టార్లే. ఈ సినిమాకు ముందు ఈ సినిమా తరువాత వీళ్లేవరో వారికే తెలియదు. కొత్తదనం కోసం కొత్త వారు అని రాజీ పడితే అందులో కంటెంట్ నిల్. ఒక సినిమా 'ప్రోమో' చూడ గానే సినిమాలో మసాలా శాతం ఎంత ఉందో అర్థమైపోతుంది. 'బూతు, క్రైమ్' ఈ రెండూ.. సేలబిలిటీ ఎలిమెంట్స్ ... ఆ బ్రమలోనే చిన్న సినిమా కథ అంతా తిరుగుతుంది. 'ఓ అబ్బాయి, ఓ అమ్మాయి, ఎంజాయ్'.. ఈ సీన్లే కథ. ఇది చెప్పుకోవడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ప్రస్తుతం చిన్న సినిమాల్లో ఉన్నది ఇదే. లో బడ్జెట్ తో తీసినా - హై వాల్యూస్ ఉంటే.. కథా, కథనాలు మిస్ అయిన కారణంగానే చిన్న సినిమాకి ఆదరణ కరువు అవుతోందనేది వాస్తవం.
అయితే ఇలా వచ్చిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో 'కమీనా', 'కిస్', 'కెవ్వు కేక', 'తెలిసి తెలియక', 'అబ్బాయి క్లాసు - అమ్మాయి మాస్', 'బ్రేక్ అప్'లు ప్రధానంగా ఉన్నాయి. వీటిలో హాస్యం అపహాస్యం పాలై.. రొమాన్సు అన్న మాట బూతుకి పర్యాయ పదంగా మారి పోయి.. 'జుగుప్త్స' లాంటి పదానికి కూడా అందనంత ఎత్తుకు ఎదిగి పోయి చివరకు ఫ్లాప్ లతో తిరుగుముఖం పట్టాయి.
సక్సెస్ సాధించిన సినిమాలు..
పాయింట్ కొత్తది కాక పోయినా - స్క్రీన్ ప్లే అయినా కొత్తగా ఉండాలి . అలా హిట్ కొట్టిన సినిమా 'ప్రేమ కథా చిత్రం'. డిఫరెంట్ కథతో.. చక్కని స్రీన్ ప్లే తో 'మారుతి' దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. కామెడీ, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ ఇలా అన్నిరకాలుగా ఉన్న ఈచిత్రానికి సక్సెస్ వరించింది. దీనితో పాటు.. వచ్చిన మరో చిత్రం 'అంతకు ముందు ఆ తరువాత'... ఈ సినిమాను పెద్ద సినిమా గా చెప్పొచ్చు . ఓ చిన్న పాయింట్ ని అందంగా చెప్పి - ప్రేక్షకులను అలరించాడు దర్శకుడు 'ఇంద్ర గంటి మోహన కృష్ణ'. ఓ మంచి కథ, అందుకు తగ్గ కథనం .. కథకు సెట్ అయ్యే నటీ నటులు అన్నీ సమ పాళ్లలో ఉన్న చిత్రం ఇది. అటు యూత్ కి.. ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులని రీచ్ అయ్యే లా ఈ సినిమా డిజైన్ చేశారు.
ఈ చిత్రం లో - పెళ్ళికి ముందు .. పెళ్ళికి తరువాత.. ఉండే సర్దుబాట్లను, సమస్యలను బోర్ లేకుండా అందంగా చూపించాడు దర్శకుడు. ఏ సీన్ కూడా వల్గార్ గా లేకుండా .. డబల్ మీనింగ్ డైలాగ్ లు లేకుండా ఆద్యంతం ప్రేష్ గా ఉంది. అందుకే హిట్ కొట్టింది.
ఇలా హిట్ బాటలోకి వచ్చిన మరో చిత్రం 'దళం'. నక్సలైట్లుగా మారిన ఓ గ్రూప్ .. పరివర్తన చెంది.. జన జీవన స్రవంతి లోకి కలవాలని అనుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి ... వాళ్లకు ముగింపు ఎలా వస్తుంది. అన్న పాయింట్ ను వెండి తెర పై ఆసక్తికరంగా ఆవిష్కరించారు దర్శకుడు. ఇక 'పోటుగాడు' విషయానికి వస్తే... పెద్ద సినిమాల గ్యాప్ ను బాగా వాడుకున్న సినిమా. మనోజ్ హీరో గా నటించిన ఈ సినిమా కరెక్ట్ టైం లో రిలీజ్ అయి మంచి హిట్ కొట్టింది. పెద్ద సినిమాలు ఏవి లేని టైం లో విడుదలై తన సత్తా చాటింది . పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాను నిర్మించారు దర్శక నిర్మాతలు. అద్భుతమైన నటనతో మంచి రెజల్ట్ అందుకున్నారు మనోజ్.
బోల్తా పడ్డా సినిమాలు..
పై సినిమాలు తప్ప మిగతా చిత్రాలన్నీ దాదాపు ఫ్లాప్ లను మూటగట్టుకున్నాయి. వీటిలో 'ప్రేమ ఒక మైకం' ఒకటి ప్రేమ కథతో వచ్చి పల్టీ కొట్టిన చిత్రం. చార్మి గ్లామర్ ను ఈ సినిమాలో ఎరగా వేసినా.. ప్రేక్షకులు మాత్ర నో చెప్పారు. 'తేజ' రూపొందించిన '1000 అబద్దాలు', సింగీతం రూపొందించిన 'వెల్ కమ్ ఒబామా', 'నీడ', 'బ్రేక్ అప్' కమీనా', మ్యూజిక్ మ్యాజిక్, లాంటి చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దాదాపు బోర్లా పడ్డాయనే చెప్పాలి.
చిన్న సినిమాలతో ఆశించిన మజా దొరకని ప్రేక్షకులు ఇక భారీ చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రియులను అలరించడానికి పవన్ నటించిన 'అత్తారింటికి దారేదీ', ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా', నాగార్జున 'భాయ్', రామ్ చరణ్ 'ఎవడు' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా - కంటెంట్ లేకపొతే ప్రేక్షకాదరణ ఉండదు . ఈ సత్యం తెలుసుకుని సినిమాలు తీస్తే విజయాలు దర్శకుల పాలిట వరంగా మారుతాయి. ఈచిన్న కాన్సెప్ట్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తారని ఆశిద్దాం..

No comments:
Post a Comment