Friday, September 27, 2013

చిన్నారి 'శ్రియ' హత్య..ముగ్గురికి జీవిత ఖైదు..

శ్రియ చిన్నారి.. గుర్తుంది కదా..కొన్ని రోజుల కిందట మహబూబ్ నగర్ జిల్లాలో ఈ చిన్నారిని దారుణంగా హత్య చేశారు. చిన్నారిని చిదిమేసిన నిందితులకు జిల్లా కోర్టు శిక్షను విధించింది. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను విధిస్తున్నట్లు జిల్లా
కోర్టు తీర్పు చెప్పింది. తీర్పు రావడాన్ని గౌరవిస్తున్నామని, కాని నిందితులకు ఉరిశిక్ష విధిస్తారని ఆశించామని చిన్నారి శ్రియ తల్లిదండ్రులు పేర్కొన్నారు.
ఆ రోజు ఏం జరిగింది..
 
ఈ ఏడాది ఎప్రిల్ 17వ తేదీన జిల్లా కేంద్రంలో ఆరేళ్ల పాప అపహరణకు గురైంది. స్థానిక బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో శ్రియ అనే పాప యూకేజీ చదువుతోంది. పాప ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో నంబర్ లేని ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పాపను ఎత్తుకెళ్లారు. శ్రియ తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్షరర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వారు కాలేజీకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమకు 10 లక్షలు ఇవ్వాలని నిందితులు ఫోన్ లో డిమాండ్ చేశారు. ఎప్రిల్ 18వ తేదీన పొల్కంపల్లి వద్ద పాడుబడిన బావిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి అపహరణ, హత్య కేసులో ప్రధాన నిందితుడు యాకూబ్ తో పాటు మహ్మద్ నసీమ్, సయ్యద్ అమీర్ లకు జీవిత ఖైదు విధించింది.

No comments:

Post a Comment