Saturday, September 28, 2013

మటన్ వరువాల్

సాధారణంగా మాంసాహార ప్రియులకు మటన్ కూడా ఎక్కువగా ఇష్టపడే వారు ఉన్నారు. మాంసాహారం తినే వారిల్లలో తప్పనిసరిగా మటన్ తో కూడా వివిధ రకాల వంటలను తయారు చేసుకుంటుంటారు. మటను కాస్త ఓపికగా, శ్రద్ద పెట్టి
చేసుకుంటే చాలా రుచికరంగా, మెత్తగా ఉంటుంది. అంతే కాదు, ఈ మటన్ వంటకాలకు ఇండియన్ మసాలా దినుసులను చేర్చడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు రుచికి కూడా అందుతుంది. మటన్ ను సాధారణంగా కాకుండా చెట్టినాడ్ స్టైల్ లో తయారుచేస్తే అది మరో డిఫరెంట్ టేస్ట్ ను అంధిస్తుంది. చెట్టినాడ్ స్టైల్లో తయారు చేసే ఈ వంటకు కొద్దిగా టైమ్ ఎక్కువ తీసుకొన్న అంత రెట్టింపు రుచిని కూడా ఇస్తుంది. మీ శ్రమను వేస్ట్ కానివ్వదు. ఈ స్పైసీ చెట్టినాడ్ వరువాల్ ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావల్సిన పదార్థాలు: మటన్: ½kg(మీడయం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి) పేస్ట్ చేయడానికి, అవసరమైనవి: కొబ్బరి తరుము: 3/4cup వెల్లుల్లి రెబ్బలు: 15 జీలకర్ర: 1tbsp సోపు గింజలు: 1 tbsp పెప్పర్ కార్న్స్(మిరియాలు): 1tbsp అల్లం: 1tbsp ఇతర పదార్థాలు: కారంపొడి: 2tbsp పసుపు: 1tsp గరం మసాలా: 1tbsp కరివేపాకు: రెండు రెమ్మలు ఆయిల్: తగినంత ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం: 1. ముందుగా పేస్ట్ కోసం సిద్దంగా పెట్టుకొన్న కొబ్బరి తురుము, వెల్లుల్లి, .జీలకర్ర, సోంపు, మిరియాలు, మరియు అల్లం వేసి మెత్తగా పేస్ట్ తయారుచేసుకోవాలి. అవసరం అయితే, కొద్దిగా నీళ్ళు కూడా మిక్స్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 2. తర్వాత మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి, మటన్ తో పాటు గ్రైండ్ చేసుకొన్న మసాలా ముద్దను కూడా వేసి, బాగా మిక్స్ చేసి మీడియం మంట మీద ఫ్రై చేయాలి. 3. ఫ్రై చేస్తూనే అందులో కారం, పసుపు, గరం మసాలా పొడి కూడా వేసి బాగా వేగించాలి. 4. 5నిముషాల పాటు మీడియం మంట మీద బాగా వేగించడం వల్ల మటన్ ముక్కలకు మసాలా బాగా పడుతుంది. తర్వాత కొద్దిగా నూనె కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. 5. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి, ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి, 25నిముషాల పాటు మటన్ ను మీడియం మంట మీద ఉడికించాలి. 4-5విజిల్స్ వచ్చేంత వరకూ ఉండి, తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దుంపుకోవాలి. 6. కుక్కర్ లోని ఆవిరంతా పూర్తిగా తగ్గే వరకూ అలాగే ఉంచిత, ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి, మటన్ కర్రీని సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని కరివేకుతో గార్నిష్ చేసి వేడి బేడిగా సర్వ్ చేయాలి. అంతే చెట్టినాడ్ మటన్ వరువల్ రెడీ. ఇది వేడి వేడి అన్నంకు యాలా అద్భుతంగా ఉంటుంది.


No comments:

Post a Comment