Sunday, September 29, 2013

'రామయ్యా'తో మాటల మాంత్రికుడు..?

'ఎన్టీఆర్'.. ప్రస్తుతం 'రామయ్యా వస్తావయ్యా' సినిమా విడుదల కోసం తహతహలాడుతున్న హీరో. ఇప్పటి వరకు మాస్ సినిమాల్లోనే ఎక్కువగా నటించిన ఈ యంగ్ టైగర్ మొదటి సారి పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైన్ గా వస్తున్నాడు. ఈ సినిమా
వాయిదాలు పడుతూ... చివరికి అక్టోబర్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తన నెక్స్ట్ మూవీపై కన్నేశాడీ హీరో. దర్శకుడు ఎవరనేదే ప్రశ్న..
ప్రస్తుతం 'అత్తారింటికి దారేదీ' సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు 'త్రివిక్రమ్'.. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలున్నాయట. అయితే పవన్ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరూ.. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని టాక్. కానీ త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్ తోనే తన కొత్త సినిమా తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఎన్టీఆర్ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ కి నిర్మాతగా.. బి.వి.యస్.ఎన్. ప్రసాద్ పేరు బలంగా వినిపిస్తుంది. అన్నీ కుదిరితే త్వరలో ఈసినిమా పట్టాలెక్కుతుందని అంటున్నాయి సినీ వర్గాలు. మరి ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

No comments:

Post a Comment