Saturday, September 28, 2013

'యంగ్ రెబల్ స్టార్'కు అకస్మాత్తుగా పెళ్లి



'ప్రభాస్'.. టాలీవుడ్ లో 'టాప్' హీరో. అమ్మాయిల మనసును దోచిన 'డార్లింగ్'. అయితే ఈ 'యంగ్ రెబల్ స్టార్' కు అకస్మాత్తుగా పెళ్లి కుదిరిందట. ఇంతకాలం ఇప్పట్లో పెళ్లిచేసుకోనని చెప్పిన ప్రభా.. ఏకంగా రాజమౌళి సమక్షంలోనే తన పెళ్లికి నిశ్చితార్ధం చేసుకున్నాడని సమాచారం. దీనికి గాను భారీ దర్బార్ సెట్టింగ్ కూడా ఏర్పాటు చేశారట. ఏంటీ..? అంతా అయోమయంగా ఉందా..? కానీ ఇది నిజం. కాకపోతే.. ఈ నిశ్చితార్థం.. నిజ జీవితంలో కాదట. తను కొత్తగా నటిస్తున్న 'బాహుబలి' చిత్ర షూటింగ్ లో భాగంగానే చిత్రీకరిస్తున్నారు. రాజమౌళీ డైరెక్షన్ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క నటిస్తుంది. ప్రస్తుతం ‘బాహుబలి' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈసినిమా షూటింగ్ కోసం 2.5 కోట్ల ఖర్చుతో భారీ దర్బార్ సెట్ వేసి ప్రభాస్, అనుష్కల నిశ్చితార్థం సీన్ చిత్రీకరిస్తున్నారట.
ఇదిలా ఉండగా.. దాదాపు రూ. 80 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ ఫోటోలను బయటకు రానివ్వకుండా రాజమౌళి కట్టడి చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా రీసెంట్ గా పైరసీ వల్లేనట. మరి ఇంత.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'బాహుబలి'కి ఆ మాత్రం భద్రత అవసరమేనని అంటున్నాయి సినీ వర్గాలు.

No comments:

Post a Comment