తన 200వ టెస్ట్ మ్యాచ్ తర్వాత క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు సచిన్ ప్రకటించాడు. ఈమేరకు బిసిసిఐకి ఇచ్చిన లేఖలో తన నిర్ణయాన్ని తెలిపాడు. నవంబర్ లో
వెస్టిండీస్ తో జరిగే రెండో టెస్ట్ సచిన్ కు చివరి మ్యాచ్ కానుంది. ఇప్పటికే టి-20, వన్డేలకు వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ ..టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రెండేళ్లుగా తన రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలకు సచిన్ తెరదించాడు. 24 ఏళ్ల తన క్రికెట్ కెరియర్ లో 198 మ్యాచ్ లు ఆడిన సచిన్ 51 సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. 16 ఏళ్ల వయసులో క్రికెట్ జీవితం ప్రారంభించిన మాస్టర్ 40 ఏళ్ల వయసులో క్రికెట్ నుండి రిటైర్ కాబోతున్నాడు. రిటైర్ మెంట్ తర్వాత సచిన్ భారత క్రికెట్ కు కోచ్ గా కానీ, మెంటర్ గా కానీ తన సేవలందించే అవకాశం ఉందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment