ఆయనగారికి డెబ్బైనాలుగు సంవత్సరాలు. ఏడుగురు సంతానం. మొదటి భార్య చనిపోయింది. రాళ్లు కోసే పని నుంచి రిటైర్ అయ్యాడు లెండి. అతనికి ఈ మధ్య
ఒకరి పట్ల ప్రేమ పుట్టింది. తమకు పెళ్లి చెయ్యమని ఏ చర్చిలో అడిగినా నో అనేశారు. చివరాఖరుగా డెవిల్స్ చర్చ్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదీ ఈ నెల పదమూడవ తారీకున. ఇంతకీ అతగాడు ఎవరు? ఎందుకని వారి పెళ్లికి చర్చిల్లో వ్యతిరేకత వచ్చింది? ఆ ఏడుపదులు నిండిన వ్యక్తి పేరు కేస్టాల్టో అపరెసిడో. బ్రెజిల్ వాసి. తను పెళ్లి చేసుకోవాలనుకున్నది మనిషిని కాదు. మేకను కాబట్టి చర్చి ఒప్పుకోలేదు. విశేషం ఏమంటే వివాహానంతరం ఆ మేకగారే తన ఏడుగురు పిల్లలకు సవతి తల్లి అని కూడా కేస్టాల్టో చెప్పుకుంటున్నాడట.
No comments:
Post a Comment