ద్యోగాల మార్కెట్ లో చాలా గట్టి పోటీ ఉంటుంది. రెజ్యూమె ఎంత ఆకట్టుకునేలా ఉండాలో, కవర్ లెటర్ కూడా అంత బాగా రాయాలి. ఎందుకంటే, ఇది చదివిన తర్వాత, రెజ్యూమె చూడకముందే అభ్యర్థి గురించి ఒక అభిప్రాయానికి
వచ్చేస్తారు. ఈ కింది అంశాలు దృష్టిలో పెట్టుకొని రాస్తే మంచి కవర్ లెటర్ తయారు అవుతుంది. స్పష్టత ఉండాలి దరఖాస్తు పెట్టుకుంటున్న అన్ని కంపెనీలకు ఒకే కవర్ లెటర్ ఉపయోగించకూడదు. కవర్ లెటర్‌లోని విషయం మీరు దరఖాస్తు చేస్తున్న హోదాను బట్టి, ఆ కంపెనీ ప్రొఫైల్ ఆధారితంగా ఉండాలి. 'ఇది ఎవరికి సంబంధించినదో వారికి' అనే అర్థంతో రాయకూడదు. ఎవరికి రాస్తున్నారన్నదానికి స్పష్టత ఉండాలి. మీరు ఏ ఉద్యోగానికైతే దరఖాస్తు చేస్తున్నారో, ఆ హోదా పేరు మొదటి పేరాలోనే వచ్చేయాలి. ఒకవేళ అక్కడ ఇతర ఉద్యోగాలు కూడా ఖాళీ ఉండి ఉంటే, అందులో స్పష్టత లేకపోతే వారు తికమకపడే అవకాశం ఉంది. అవసరమైనంత చెప్పండి లోపల రెజ్యూమెలో ఉన్న విషయాన్నంతా కవర్ లెటర్‌లోనే చెప్పేయాలని చూడకండి. కవర్ లెటర్ సృజనాత్మకంగా ఉండాలి. మీరు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్ళు అన్నీ క్లుప్తంగా రెండు, మూడు పేరాల్లో ముగించేయాలి. మీ రెజ్యూమె విలువను పెంచండి ఒక మంచి భోజనానికి ముందు స్టార్టర్ట్‌లా కవర్ లెటర్ ఉండాలి. చదవగానే, ఇంకా రెజ్యూమెలో ఏం ఉందో అని ఉత్సుకత రేపేలా ఉండాలి. రాసే విధానంలో వృత్తిపరమైన గౌరవ మర్యాదలు లోపం లేకుండా ఉండాలి. ఉద్యోగా వకాశానికి సంబంధించిన అంశాలపై ఎక్కువగా కేంద్రీకరించి రాయాలి. ఆశావహ ధృక్పథం కవర్ లెటర్‌లో మీ ఆశావహ ధృక్పథం కనిపించాలి. మీరు అప్పటి వరకు చేస్తున్న ఉద్యోగం గురించి ఎటువంటి వ్యతిరేకత కానీ చిరాకు కానీ చూపించకూడదు. ఇంకా మీరు చేస్తున్న పనిలో, మీ ప్రదర్శనకు సంబంధించిన కితాబులు ఇచ్చుకోవచ్చు. రాసే వాక్యాలలో 'నేను', 'నాకు' ఎక్కువ వాడకూడదు. అనవసర విషయాలు వద్దు కవర్ లెటర్ మీరు ఎంత ఆత్మవిశ్వాసం కలవారో తెలియచేసేట్టు ఉండాలి. బయట మీకున్న పరిచయాల గురించి గొప్పలు , పెద్దవాళ్ళ రిఫరెన్స్‌ల గురించి ప్రస్తావించకూడదు. సాధారణంగా, మీ గురించి తెలిసినవారిని రిఫరెన్స్ కోసం సూచించమంటారు. అటువంటపుడు మీ వ్యక్తిగత, ఉద్యోగ జీవితం గురించి బాగా తెలిసిన వ్యక్తి రిఫరెన్స్ మాత్రమే ఇవ్వండి. మీ పనికి సంబంధించిన పనికి సంబంధించిన లింక్స్ ఇవ్వండి. మిమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా తప్పక ఇవ్వాలి. ఆఖరున కవర్ లెటర్ రాసిన తర్వాత, అచ్చు తప్పులు లేకుండా చూడాలి. వ్యాకరణ దోషాలు, వాక్య నిర్మాణం సరిగా ఉన్నాయో లేదో ఒకటికి నాలుగు సార్లు సరి చూసుకోవాలి. అక్షరాల పరిణామం చదవడానికి సౌకర్యవంతంగా ఉండాలి. ఆఖరుగా ధన్యవాదాలు తెలిపి, వారిని కలవడానికి ఎదురు చూస్తున్నామంటూ ముగించాలి.

No comments:
Post a Comment