Monday, October 28, 2013

దీపావళికి ఈ హెయిర్ స్టైల్స్...

దీపావళికి ఇంటి అలంకరణ ఎంత ముఖ్యమో.. అతివళ అలంకరణ కూడా అంతే ముఖ్యము. అతివళు అలంకరణ, కొత్త బట్టలు ధరించడం ఈ పండగ ప్రత్యేకత. ఈ సందర్భంలో మార్కెట్ అంతా బిజీబిజీగా ఉంటుంది. అలంకరణ వస్తువుల,
వస్త్రాలు, టపాకాయలు ఒక్కటేంటి ఇటు కొనుగోలు దారులు, అటు అమ్మకం దారులతో మార్కెట్ అంతా కళకళలాడుతుంటుంది. దీపావళి అంటేనే కొత్త బట్టలు, టపాకాలు. ఈ పండుగ రోజున సాంప్రదాయకరమైన కొత్తబట్టలు వేసుకోవడం అంటే చాలా మంది ఇష్టం. అయితే దీపావళికి కొత్త బట్టలు వేసుకొనేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండటం అవసరం. టపాకాయలు కాల్చేసమయం ఎటువంటి అపాయం అయినా జరగవచ్చు. కాబట్టి అలాంటి ప్రమాధాలు జరగకుండా జాగ్రత్తపడాలి. అందుకు ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. సాధారణంగా స్త్రీలు, పిల్లలు ధరించే సిల్క్ వస్త్రాలు, నెటెడ్ వస్త్రాలు, మస్లిన్, అతి త్వరగా వేడికి తాకగలిగే తేలికయైన, పలుచని వస్త్రాలకు దూరంగా ఉండటమే మంచిది. అంతే కాదు దీపావళి సమయంలో కురుల సంరక్షణ కూడా చాలా అవసరం. ఎవరికైతే ఒత్తైన పొడవైన కురులు కలిగి ఉంటారో వారు కురులను ఫ్రీగా లూజ్ గా స్టైల్ గా వదలడం కంటే, సౌకర్యవంతంగా ఉండేలా భారతీయ సాంప్రదాయ పద్దతి ప్రకారం దీపావళి రోజు జడను వేసుకోవడం వల్ల అందానికి అందం. సౌకర్యవంతంగానూ ఉంటుంది. దేశీ లుక్ ను ప్రయత్నించేటప్పుడు మీ హెయిర్ స్టైల్ మీద కూడా దృష్టి పెట్టడం చాలా అవసరం. సరైన హెయిర్ స్టైల్ లేకుండా ప్రొపర్ లుక్ ఇవ్వదు. దీపావళి రోజున అందంగా కనబడటం అటుంచితే, మీరు చాలా జాగ్రత్త మరియు సురక్షితంగా ఉండాలి. కాబట్టి సౌకర్యవంతమైన దుస్తులతో పాటు, హెయిర్ స్టైల్ ను కూడా మార్చాలి. ఇలా చేయడం వల్ల అనుకోకుండా జరిగే కొన్ని అపాయాల నుండి బయటపడవచ్చు. కురులను జడగా అల్లినా, ముడి వేసుకొన్నా, పొట్టి జుట్టు ఉన్నవారు ఫ్రీగా వదులుకొన్నా ఎలా వేసుకొన్నా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. భారతీయ కేశాలంకరణ ఫ్యాషన్ కాకపోయినా, చూడటానికి అందంగా కనబడుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కొన్ని ఫాషన్ షోలలో ఫ్యాషన్ గా ఎటువంటి దుస్తులు ధరించినా కేశాలంకరణ మాత్రం ఇండియన్ స్టైల్ ను ఫాలో అవుతుంటారు. మరి ఈ దీపావళి సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మీరు అందంగా కనబడటం కోసం కొన్ని హెయిర్ స్టైల్స్. మీరు ధరించే దుస్తులకు సూట్ అయ్యే హెయిర్ స్టైల్స్ ను ఇక్కడ అంధిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన స్టైల్ ఎంపిక చేసుకొని చక్కగా అలంకరించుకొంటే అందంతో పాటు దీపావళి రోజున సేఫ్ గా కూడా ఉంటారు.

No comments:

Post a Comment