Thursday, October 3, 2013

సిగరెట్లను మానండిట్లా..


ఒత్తిడి తట్టుకోలేకనో.. స్నేహితుల బలవంతంతోనో.. ఫ్యాషన్‌, స్టైల్‌ కోసమనో.. పొగ తాగారా..? అదే అలవాటుగా మారిందా..? దానికే బానిసైపోయారా..? మానేయడం మీ వల్ల అవట్లేదా..? అయితే ఇలా ఓసారి ప్రయత్నిద్దాం..
పొగ మానేయాలంటే మొదట మిమ్మల్నీ మీరు నమ్మాలి. మనసు మన మాట వినాలి. 'ఖచ్చితంగా మానేయగలను' అని ఒకటికి పదిసార్లు మనసులో అనుకోండి. గతంలో మీరు పట్టుదలతో సాధించిన పనులను గుర్తుకు తెచ్చుకోవాలి. మీ చుట్టూ ఉన్న స్నేహితులు, ఉద్యోగులు, పొగతాగేవారున్నారా? అయితే వారితో కొన్ని రోజులు మాట్లాడడం మానేయడమే మంచిది. వారు సిగరెట్‌ తాగే సమయానికి వారి నుంచి దూరంగా వెళ్లితే సరి. ఆ సమయానికి అతి ముఖ్యమైన పనేదైనా పెట్టుకుంటే మరీ మంచిది. ఒత్తిడి కలిగించే పనులను కొద్ది రోజులు దూరంపెట్టండి. సిగరెట్‌ ఎన్నిరోజుల్లోపు మానేయాలో మీకు మీరే ఒక తేదీని నిర్ణయించుకోండి. ఆ తేదీ వరకు క్రమంగా సిగరెట్ల సంఖ్య తగ్గిస్తూపోండి. మీరు గౌరంవించే, మిమ్మల్నీ అభిమానించే వ్యక్తులతో తను సిగరెట్‌ మానేస్తున్నానని చెప్పండి. వారికిచ్చిన మాట కోసమన్నా మనసు మారుతుంది. వారి ప్రోత్సాహంతో మీలోని పొగలాగలన్న కోరిక తగ్గే అవకాశముంటుంది. జేబులో చిల్లర డబ్బులు ఉంచుకోకపోతే అది కొంత మనకు సహాయపడుతునట్లే. మీరు పొగతాగని వ్యక్తిగా మారుతున్న విధానాన్ని నిత్యం మీకు మీరే గమనిస్తుండాలి. ఈ పక్రియ మీకు తెలియకుండనే మిమ్మల్నీ పొగ మానేందుకు ప్రోత్సహిస్తుంది. పొగతాగడం మానేసినట్లు, మిమ్మల్నీ ఎదుటివారు మెచ్చుకుంటున్నట్లు ఊహించుకోండి. మీరు సిగరెట్‌ కొనకుండా ఆదా చేసిన డబ్బును నిత్యం లెక్కబెట్టుకోండి. పొగతాగడం వల్ల ఆరోగ్యం ఎలా క్షిణిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించిన పుస్తక పఠనానికి మొగ్గు చూపండి. సిగరెట్లు తాగడం వల్ల నష్టాలేంటో, లాభాలేంటో మీ మనసుతో మీరే చర్చించండి. పొగ తాగినందుకు ఎంతో నష్టపోయినట్లు ఫీలవ్వండి. పొగతాగిన వెంటే మీ నోటి వాసనను గమనించుకోండి. అది ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్నీ ఎంత అసౌకార్యానికి గురిచేస్తుందో, ఇతరులు మన వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించి వాటిని అధిగమించండి.
మానడం కోసం.. మంచి అలవాట్లు...
రోజూ పొగలాగేందుకు అలవాటు పడిన నోరు క్రమంగా తగ్గించినా ఆ సమయానికి నాలుక గోల చేస్తూనే ఉంటుంది. పొగ మానేందుకు, ఆరోగ్యానికి మంచివైన కొన్ని అలవాట్లు చేసుకుంటే సరి. ఏవేనీ ఎండు ఫలాలు తింటుండాలి. వాటికి పొగరుచిని, తాగాలనే కోరికను తగ్గించే గుణం ఉంటుంది. పొగతాగాలనే కోరిక మరీ పెరుగుతుంటే ఉప్పుతో కూడిన భోజనం చేయాలి. చిప్స్‌, అప్పడాలు, పచ్చళ్లు ఆ కోరికను చంపేందుకు ఉపయోగపడుతాయి. దాల్చిన చెక్కను నమలాలి. ఇది నికోటిన్‌పై ఉన్న వాంచను తొలగించండంలో సులువైన ఇంటి వైద్యం. నారింజ, నిమ్మ, ఉసిరి, జామా ఎక్కువగా తింటుండాలి. విటమిన్‌-సి సమృద్ధిగా ఉండే ఆహారం పొగతాగాలనే కోరికను తొందరగా తగ్గింస్తుంది. పొగతాగడానికి ముందు పళ్లు, పాలు, ఆకుకూరలు, కాయగూరలు తినాలి. వాటిని తిన్న వెంటనే సిగరెట్‌ తాగితే నోరు చేదుగా ఉంటుంది. దాంతో పొగతాగడం మధ్యలోనే ఆపేయొచ్చు.

1 comment: