Friday, October 18, 2013

అది ధ్రువపు ఎలుగుబంటి

    మాలయాలలో 'యెతి' అనే అంతుబట్టని ప్రాణి సంచరిస్తోందని ఆనోటా ఆనోటా వ్యాప్తిలో ఉన్న వదంతి వెనుక రహస్యాన్ని చేóదించానని బ్రిటిష్‌ సైంటిస్టు ఒకరు చాటారు. అది పురాతనకాలపు ధ్రువపు ఎలుగుబంటి అని ఆయన
తేల్చారు. 'యెతి' అంతుబట్టని ప్రాణి అని కొందరంటే అది పెద్ద పరిమాణంలో పూర్వీకులకు చెందిన మానవుడని మరి కొందరు ప్రచారం చేశారు. అది చూడడానికి ఏహ్యంగా ఉండే మనిషి అని కూడా ప్రచారంలో ఉంది. అతని పాదముద్రను చూసినట్లు కూడా కొంతమంది ప్రచారం చేశారు. ' బిగ్‌ ఫుట్‌' గా ఈ వదంతిపై కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ రహస్యాన్ని ఛేదించడంపై సైంటిస్టులు దృష్టిపెట్టారు. బ్రియాన్‌ సైక్స్‌ అనే ఓ బ్రిటిష్‌ శాస్త్రవేత్త తాను ఆ 'యెతి' రహస్యాన్ని ఛేదించానని తాజాగా చాటారు. ఆయన జీన్‌ పరిశోధనల శాస్త్రజ్ఞుడు. హిమాలయా లలో సంచరించే యెతికి చెందినదిగా భావించబడుతున్న జుట్టుపై ఆయన జెనెటిక్‌ పరిశోధన సాగించారు. జుట్టు డిఎన్‌ఏను పరిశోధించగా అది పురాతన ఆర్కిటిక్‌ జాతి ధ్రువపు ఎలుగుబంటిదని తేలినట్లు బ్రియాన్‌ సైక్స్‌ ప్రకటించారు. ఇది లక్షా 20 వేల సంవత్సరాల క్రితం జీవించింది. తాను కనుగొన్నది ధ్రువపు ఎలుగుబంటికి, వేరే జాతి (బ్రౌన్‌) ఎలుగుకీ సంకరం కావచ్చని కూడా బ్రియాన్‌ సైక్స్‌ ఎన్‌బిసి న్యూస్‌కు వివరించారు. ఈ శాస్త్రవేత్త ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సైంటిస్టు. ఏడాదిపాటు ఈయన ఈ పరిశోధన సాగించారు. మానవుని పురాతన మూలాల గురించి ఇంతకు ముందు ఆయన పరిశోధన జరిపి పేరుతెచ్చుకొన్నారు. ఇంతవరకూ 'యెతి' గురించిన విశ్లేషణలలో సైక్స్‌ చేసినదే మంచిదని ఇతర సౖౖెంటిస్టులు కూడా కొనియాడారు. 
ఆ ప్రాణి ఎవరూ చూడనిది
హిమాలయాలలో అంతకుముందు ఎవరూ ఎపుడూ చూడనిది కావడంతోనే ' వింత ప్రాణి ' వదంతి వ్యాప్తిలోకి వచ్చి ఉండవచ్చని సౖౖెక్స్‌ అన్నారు. 'యెతి'ని అంతుబట్టని రహస్యంగా కొనసాగనివ్వకుండా ఒక్కసారిగా నిజం తేల్చివేయడమే తన పరిశోధన ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. 
తాను ఈ పరిశోధన ద్వారా ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటున్నానని సహచరులంతా హెచ్చరించారనీ, అయితే తాను ఆసక్తితో పరిశోధన కొనసాగించాననీ సైక్స్‌ చెప్పారు. గతంలో 'యెతి'ని చూసినట్టు కొందరు అనడంతో తలెత్తిన ప్రశ్నలకు సైక్స్‌ పరిశోధనలో మంచి జవాబు దొరికిందని ఇతర సైంటిస్టులు ప్రశంసించారు. కొంతకాలం క్రితం 'యెతి' లేదా అటువంటి ఆదిమప్రాణి ఆవశేషాలను పంపి తనకు సహకరించవలసిందిగా సైక్స్‌ ప్రపంచానికి పిలుపును ఇచ్చారు. అది చూసి దాదాపు 30 మంది దాకా సానుకూలంగా స్పందించి 'యెతి'గా భావించబడుతున్న జుట్టును పంపారు. ఆ అవశేషాలను ఆయన క్షుణ్ణంగా పరిశోధించారు. 
శతాబ్దాల కాలంగా 'యెతి' వదంతి వ్యాప్తిలో ఉంది. అది అంతుబట్టనిది, భీకరాకారం గలదిగా ప్రచారంలో ఉంది. ఇటీవల 'బిగ్‌ ఫుట్‌ ఫైల్స్‌' పేరిట ఈ మొత్తం కథనం డాక్యుమెంటరీగా బ్రిటన్‌లో చానల్‌ 4 టీవీ నెట్‌వర్క్‌లో ప్రసారమైంది. తాజా సమాచారాన్ని కూడా వారే వెల్లడించారు. తాజా వెల్లడితో ఇక వదంతులకు తెరపడుతుందని ఆశిద్దాం.

No comments:

Post a Comment