Thursday, November 7, 2013

మిరపకాయలోని వైద్యపరమైన ....

మిరపకాయ (చిల్లీ పెప్పర్) అనేది సొలనేసి కుటుంబం, సొలనేసి లోని మిరప కాప్సికమ్ తరగతికి చెందిన మొక్కలకు కాచే ఒక పండు. మిరపకాయలనేవి మొదట అమెరికాల్లో వెలుగుచూశాయి. కొలంబియన్ ఎక్ఛేంజ్ తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం మరియు ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది.
మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి , ఘాటు గుర్తుకు వస్తుంది .. కాని మిరప లేకుండా వంట సాగదు , పచ్చి , పండు , ఎండు మిరప లను మనము వాడుతాం . మిరప భారతీయ మొక్క కాదు . మన వారు కారం కోసం మిరియం వాడేవారు. మిరపకాయలు ఘాటుగా వుంటాయి. తెలుగు వారికి మిరపకాయలను కూరలలో వాడటంతోపాటు, వాటితో చేసిన బజ్జీలను తినడం చాలా ఇష్టం. మిరప పండ్లను తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది.దీనిని సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. అలాగే తాజా మిరప పండ్లను ఊరగాయ వేయడం ద్వారా కూడా దీర్ఘకాలం నిల్వచేయడం జరుగుతోంది. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి , ఆహర పరిరక్షణకు, ఆత్మ రక్షణకు వాడుతారు.
మిరపకాయలో ఇంత ఘాటు ఎందుకుంటుందంటే వీటిలో క్యాప్‌సైసిన్ (8-మిథైల్-ఎన్ -వనిల్లైల్-6-నోనెనామిడ్) మరియు అనేక సంబంధిత రసాయనాలు భాగం వహిస్తాయి, వీటన్నింటినీ కలిపి క్యాప్‌సైసినాయిడ్స్ అంటారు. విపరీతమైన మంటను కలిగించే ఆయుధంగా ఉపయోగించే పెప్పర్ స్ప్రేలో క్యాప్‌సైసిన్ అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. కారంతో కళ్ళలోనూ, ముక్కుల్లోనూ నీళ్లు తెప్పించే మిరపకాయలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మిరపకాయలన్నింటిలో కారం ఇచ్చే రసాయనం 'కాప్సైసిస్‌్‌' అనే అల్కలాయిడ్‌ వుంటుంది. ఈ రసాయనానికి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు. మిరపలో కారంతోపాటు విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. పచ్చిమిరపకాయలు బాగా తినేవారిలో కొన్ని రకాల వ్యాధులు ముఖ్యంగా గుండె జబ్బులు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. అంతే కాదు, మిరపలో మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం...

No comments:

Post a Comment