Friday, January 24, 2014

ముఖ చర్మం పగుళ్ళకు కారణాలు...

స్కిన్ పీలింగ్ మరియు చర్మం మీద పొరలుగా రాలడం అనేది చర్మం మీద పైపొర ఊడిరావడం. ఇక రకంగా దీన్ని డెడ్ స్కిన్ సెల్స్ అని చెప్పవచ్చు. ఇది నేరుగా చర్మాన్ని డ్యామేజ్ చేయండం
లేదా కొన్ని పరిస్థితులకు కారణం కావచ్చు. స్కిన్ పీలింగ్ అనేది సహజం మరియు ఇది వయస్సును బట్టి జరుగుతుంది. ముఖం మీద స్కిన్ పీలింగ్ (చర్మం పొరలుగా ఊడిరావడం)ఒక బాధాకరంగా మరియు కొన్ని సందర్భాల్లో చిరాకుగా కూడా ఉంటుంది. అలా ఊడివచ్చు సందర్భంలో మీరు దాన్ని లాగేయాలనుకుంటారు, కానీ, దాన్ని మీరు బాగా తెలిసి ఉండాలి. చర్మం పైపొర పెలుసుగా ఊడివచ్చు సమయంలో దాన్ని లాగడం వల్ల అది నిజంగా నయం కాదు. కొన్ని సందర్భల్లో, పైకి లాగడం వల్ల అది చర్మం మీద మరింత వరెస్ట్ గా తయారవ్వడం మీరు గుర్తించవచ్చు. కాబట్టి, దాన్ని పైకి పీకేడం కంటే మరింత బెటర్ గా ఉండేలా ఉత్తమ మార్గాలను తెలిసి ఉండాలి. ఇలా చర్మం పొరలుగా ఊడి వచ్చుటకు కొన్ని కారణాలు క్రింది విధంగా ఉన్నాయి. సన్ బర్న్: స్కిన్ పీలింగ్ కు ఒక అత్యంత ప్రజాదరణ పొందిన కారణలలో ఒకటి సన్ బర్న్. సూర్యరశ్మిలోని యూవికిరణాలకు చర్మం అధికంగా బహిర్గతం అవ్వడం వల్ల, అది మీ చర్మానికి హానికలిగించవచ్చు. మరియు చర్మం పొరలుగా ఊడివచ్చుటకు మరింత కారణం అవ్వొచ్చు. పొడి చర్మం: ముఖం మీద చర్మం పొరలుగా ఊడివచ్చుటకు మరో ప్రధాణ కారణాలలో పొడి చర్మం కూడా ఒక ముఖ్య కారణం. మీ చర్మం పొడిబారినప్పుడు, ఇది చర్మం మీద ఉండకుండా ఇది పొడిగా ఊడివస్తుంది. అలెర్జీ ప్రభావాలు లేదా తామర : దద్దుర్లు లేదా తామర ముఖం చర్మం మీద పైపొర పొరలుగా పైకి ఊడివస్తుంది. మీరు కొన్ని కాంపౌట్స్ మరియు వాటిని వినియోగించడం వల్ల అలర్జీ ల్ల చర్మ పొరలుగా ఊడివచ్చుటకు కారణం అవుతుంది. రోగనిరోధక శక్తి విషయాలు : క్యాన్సర్ మరియు ఇతర సంబంధిత చర్మం లోపాలు కూడా ముఖం చర్మం పీలింగ్ కు కారణమవుతుంది . చర్మం పాలిపోవడం కోసం చికిత్స ఇక్కడ స్కిన్ పీలింగ్ చర్మం సమస్యను నివారించడానికి కొన్ని చికిత్స పద్ధతులున్నాయి. మాయిశ్చరైజింగ్ : స్కిన్ పీలింగ్ సమస్యను నివారించడానికి మాయిశ్చరైజింగ్ అద్భుతంగా సహాయపడుతుంది. ఎప్పటకప్పుడు చర్మానికి మాయిశ్చరైజ్ రాయడం మంచిది. అలాడే స్కిన్ మాయిశ్చరైజింగ్ కోసం మంచి బ్రాండ్స్ ను ఎంపిక చేసుకోవాలి. పోషక ఆహారం: మీ ఆహారంలో అవసరం అయ్యే ప్రోటీన్లు , ఇనుము , విటమిన్స్ అంటే A, B మరియు C వంటి విటమిన్లు ఉన్న ఆహారాలు తీసుకొన్నప్పుడు, ఆటోమ్యాటిక్ గా చర్మం కూడా మాయిశ్చరైజ్ అవుతుంది. ఇది డ్రై స్కిన్ ను దూరం చేస్తుంది . దోసకాయ మిక్స్ : తురిమిన దోసకాయ గుజ్జు ఒక సహజ మాయిశ్చరైజర్ ఉంది . మీ ముఖం చర్మంపై క్రమంగా అప్లై చేయవచ్చు. అలాగే ఈ కీరదోసకాయ మిక్స్ కు కొద్దిగా ఆలివ్ ఆయిల్, తేనె మరియు పసుపు వంటివి బెటర్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. హనీ : స్కిన్ పీలింగ్ సమస్యను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది తేనె. తేనెను నేరుగా మీ ముఖానికి అప్లై చేయవచ్చు . అరగంట తర్వాతగోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. డ్రై స్కిన్ కు ఇది నేచురల్ మాయిశ్చరైజర్ . వోట్మీల్ : వోట్మీల్ స్నానం మీ చర్మం కోసం మంచిగా ఉంది . ఇంకా బేబీ ఆయిల్ మీ చర్మానికి మాయిశ్చరైజ్ చేసుకోవడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పాలు: మీరు ఒక వస్త్రంను పాలలో నానబెట్టి తర్వాత దీన్ని ముఖం మొత్తం తుడవాలి. ఇది ఒక అనుకూల ఫలితాలను ఇస్తుంది . మీ చర్మం పీలింగ్ కు గురికాకుండా తక్కువ చేస్తుంది.


No comments:

Post a Comment