Tuesday, January 28, 2014

చక్కెరతో చిక్కే !

చక్కెర ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. తాజా అధ్యయనం దీనికి మరింత బలం చేకూర్చింది. అదేమిటంటే
చక్కెరతో కూడిన తీపి పానీయాలను తీసుకోవడం అధిక బరువుకు కారణమవు తుంది. మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే, ఇది అల్జీమర్స్‌ వ్యాధితోపాటు, క్యాన్సర్‌కు దారితీస్తుందని 'పార్కిన్సన్‌ డిసీజ్‌ అండ్‌ స్కిజోఫ్రెనియా' వారు వాషింగ్టన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగంలో కొన్ని ఎలుకలకు చక్కెర పానీయాన్నీ, మరికొన్ని ఎలుకలకు మంచినీటినీ ఇచ్చి వేర్వేరుగా పరిశీలించారు. చక్కెర పానీయాలను తీసుకున్న ఎలుకల మెదడులో అసాధారణమైన మార్పులు జరగడం వల్ల అవి చాలా హైపర్‌ యాక్టివ్‌గా ప్రవర్తించాయి. దీనికి కారణం చక్కెరలో ఉన్న ప్రోటీన్‌లు మెదడులోని నిర్ణయాలు తీసుకునే భాగంపై ప్రభావాన్ని చూపడమేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే, చక్కెరలోని కెఫిన్‌ వల్ల జీవక్రియలలో మార్పుతో పాటు, నరాలలో పెను లోపం ఏర్పడుతుంది.ఇది మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగించి, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. ఈ సంగతి కూడా తాజా పరిశోధన
తేల్చింది.

No comments:

Post a Comment