సహజంగా మనకు ఆహారం రుచిగా ఉండాలి. మరి అమ్ముకునే వారికో.. వాళ్లకు
రుచి కంటే చూడటానికి అందంగా ఉండాలి. చాలామందికి దీర్ఘకాలం నిల్వ ఉండాలి.
ఇవన్నీ కావాలంటే
ఆహారానికి కొన్ని రసాయనాలు కలపడమే. ఇలా ఆహారానికి కలిపే పదార్థాలను ఎడిటివ్స్ అంటారు. ఈ ఎడిటివ్స్ ఆరోగ్యకరమేనా? ఇలాంటి ఎడిటివ్స్‌లో తీపినిచ్చే పదార్థాలు ఏమిటి? ఆరోగ్యకరమైన వాటి ప్రత్యామ్నాయాలు ఏమిటో చదవండి..
ఒక ఆహారపదార్థాన్ని దీర్ఘకాలం నిల్వ ఉంచడానికో లేదా ఆహారాన్ని కంటికి ఇంపుగా రంగులు ఇవ్వడానికో ఉపయోగించే ఎడిటివ్స్ చాలా రకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్, ఆహారానికి రంగునిచ్చే కలరేటివ్ ఏజెంట్స్, సువాసనను, రుచిని ఇచ్చే ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇన్ఫెక్షన్ రాకుండా చూసే యాంటీ ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్.. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఆహారానికి ఏదో గుణాన్ని కలిపేవే. అయినా, పోషకాలపరంగా చూస్తే వీటివల్ల అదనంగా చేకూరేదేమీ లేదు.
కృత్రిమంగా తీపినిచ్చే పదార్థాలు
చాక్రిన్ అనేది స్వాభావికమైన చక్కెర కంటే 300 రెట్లు అధికమైన తీపిని ఇస్తుంది. సుక్రలోజ్ అనే దాన్ని క్లోరినేటెడ్ చక్కెర నుంచి తయారుచేస్తారు. దీన్ని ఎక్కువగా బేకరీ ఐటమ్స్‌లో ఉపయోగిస్తారు. దీన్ని 'స్ల్పెండా' పేరిట అమ్ముతారు. ఏస్ సల్ఫమీ-కె అనేది ఒక రకమైన రసాయనిక తీపి పదార్థం. దీన్ని శీతల పానీయాల్లో కలుపుతారు. ఆస్సార్టమే అనేదాన్ని సాధారణ పరిభాషలో 'న్యూట్రా స్వీట్'గా వ్యవహరిస్తారు. దీన్ని సుగర్ ఫ్రీ పదార్థాల్లో కలుపుతారు.
అయితే ఆస్సార్టమే అన్నది క్యాన్సర్ కారకమని చాలామంది నిపుణుల భావన. పైగా నరాలపై దుష్ప్రభావం చూపుతుందనే అభిప్రాయమూ ఉంది. దీర్ఘకాలం వాడితే జ్ఞాపకశక్తి తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. బ్రెయిన్ ట్యూమర్, లింఫోమా, డయాబెటిస్, మల్టిపుల్ స్ల్కిరోసిస్, పార్కిన్‌సన్ డిసీజ్ వంటి అనేక వ్యాధులకు పరోక్షంగా కారణమవు తుంది. కాబట్టి ఇలాంటి కృత్రిమ తీపి పదార్థాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం అంత మంచిది కాదు.
ఏ ఆహారంలో ఉండొచ్చు!
షుగర్ ఫ్రీ సోడాలు, కొన్ని డెజర్ట్‌లు (ఆహారం తర్వాత తీసుకునే తీపి పదార్థాలు), బేకింగ్ వస్తువులు, పుడ్డింగ్, ఐస్ టీలు, కొన్ని చప్పరించే పిప్పర్‌మింట్స్, టూత్‌పేస్టులలో ఉండొచ్చు.
తీపి కావాలంటే?
ఏదైనా తీపి పదార్థం స్వాభావికమైన చక్కెరతో తయారు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. దీంతో సామన్యులందరికీ ఈ విధంగా అందుబాటులోకి తేవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు మరి అవే తీపి పదార్థాలను అందరికీ అందుబాటులో ఉండేలా చవగ్గా అందించడమెలా? దీనికి పైన పేర్కొన్న కృత్రిమమైన వాటికి బదులు స్వాభావికమైన తీపి పదార్థాలపై ఆధారపడవచ్చు.
వీటినే సహజ సిద్ధంగా తీపినిచ్చేవి (నేచురల్ స్వీటెనర్స్) అంటారు. అందుకే కృత్రిమమైన వాటికి బదులు స్వాభావికమైన తీపినిచ్చే పదార్థాలు ఉపయోగిస్తే అటు ఆరోగ్యం, ఇటు అందుబాటు ధరలకే పొందవచ్చు.
స్వాభావికమైన తీపి పదార్థాలు
స్టీవియా: ఈ తీపి పదార్థాన్ని 'స్టీవియా రెబొడినా' అనే మొక్క నుంచి సేకరిస్తారు. ఇది చక్కెరతో పోలిస్తే 290 రెట్లు ఎక్కువ తీపి ఉంటుంది. దీన్ని చక్కెర (సుక్రోజ్)తో కలిపి మనకు వాణిజ్య ప్రయోజనాల కోసం 'సీఎస్‌ఆర్ స్మార్ట్' పేరిట మార్కెట్‌లో లభ్యమయ్యేలా చేస్తున్నారు.
సార్బిటాల్: దీన్నే గ్లూసిటాల్ అంటారు. కొన్ని రకాల పండ్లను పాకం పట్టినప్పుడు చక్కెర పాకంలా తయారైన పదార్థం నుంచి దీన్ని సేకరిస్తారు. చక్కెరతో పోలిస్తే దీనిలో తీపిదనం 60 శాతం మాత్రమే.
గ్లైలిటాల్ : కొన్ని పండ్లను లేదా కూరగాయలను పాకంలా పట్టినప్పుడు అందులోని పీచుపదార్థాల నుంచి గై ్జలిటాల్ తయారవుతుంది. ఇది దాదాపు చక్కెర అంత తియ్యగా ఉంటుంది. కానీ చక్కెర ఇచ్చే శక్తి కంటే ఇది ఇచ్చే శక్తి చాలా తక్కువ. అంటే చక్కెర నుంచి వచ్చే శక్తిలో మూడింట రెండు వంతుల శక్తినే ఇది ఇస్తుంది.
స్వీటెనింగ్ ఆపిల్ ఎక్స్‌ట్రాక్ట్స్: కొన్ని ఆపిల్స్ నుంచి తీపి పదార్థాల (ఆపిల్ ఎక్స్‌ట్రాక్ట్స్) నుంచి సేకరించిన పదార్థాలు స్వాభావికం కావడంతో ఇవి తియ్యదనాన్నీ, రుచినీ, ఆరోగ్యాన్నీ ఏకకాలంలో అందిస్తాయి.
ప్రయోజనాలు
కృత్రిమ తీపి పదార్థాలకు బదులు స్వాభావికమైన తీపి పదార్థాలను ఉపయోగించడం వల్ల ఆహారానికి చవగ్గా తీపిని అందించవచ్చు. దాంతోపాటు మరికొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. ఉదాహరణకు..
స్టీవియాను మొక్క నుంచి సేకరిస్తారు కాబట్టి అది హానికరం కాదు. ఆ తీపి వల్ల రక్తంలోని చక్కెర పాళ్లు పెరగవు. కాబట్టి డయా బెటిస్ రోగులకు స్టీవియా తీపి మంచిది.
అగేవ్ నెక్టర్: ఇది మెక్సికోలో పెరిగే ఒక రకం మొక్క నుంచి సేకరించే పాకం. దీనిని తినడం వల్ల సాధారణ చక్కెర కంటే తక్కువ తీపి విడుదలవుతుంది. అందుకే రక్తంలో సుగర్ పాళ్లు పెర గవు. కాబట్టి డయాబెటిస్ రోగులకు ఇది మంచి ప్రత్యామ్నాయం.
డేట్ సుగర్ : దీని ఉపయోగం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. డేట్ సుగర్ అంటే.. ఎండబెట్టిన ఖర్జూరాలను పొడిలా చేసి, దాన్ని పంచదారలా వాడుకోవడమే. అయితే ఇది వేడి పదార్థాలలో కరగదు. ఉదాహరణకు వేడి వేడి టీలో దీన్ని చక్కెరలా వేసుకోవడం సాధ్యం కాదు. అయితే బేకింగ్ ఉత్పాదనలకు తీపి పదార్థం (స్వీటెనింగ్ ఆడిటివ్)లా వాడుకోవచ్చు.
తేనె: దీని ప్రాధాన్యం, ప్రాచుర్యం అందరికీ తెలిసిందే. ఇది కేవలం ఒక రుచిని ఇచ్చే ఆహారంగానే కాక.. ఔషధ గుణాలు కలిగి, ఆరోగ్యాన్నిచ్చేది. దీని ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.
కాబట్టి స్వాభావికమైన తీపి పదార్థాలు (నేచురల్ స్వీటెనర్స్) ఉన్నవి వాడడాన్ని ప్రోత్సహించవచ్చు. వీలును బట్టి డయాబెటిస్ రోగులకూ వీటిని ఇవ్వవచ్చు.
ఆందోళన వద్దు!
కృత్రిమ తీపి పదార్థాల వల్ల వచ్చే జబ్బుల జాబితాను చూసి అంతగా ఆందోళనపడాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే.. కృత్రిమ తీపిపదార్థాల వల్ల ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలపై ఇంకా విస్తృతమైన పరిశోధనలు జరగాల్సి ఉంది. కొన్ని పరిశోధనల ఫలితాలు పరస్పర భిన్నంగా ఉండటంతో వీటివల్ల కలిగే హాని అనే అంశం ఇప్పటికీ చర్చనీయాంశమే!
ఉదాహరణకు చాక్రిన్ అనే కృత్రిమ తీపి పదార్థాన్ని కలిపిన మిఠాయిలు క్యాన్సర్ కారకాలని ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. కానీ అవి అదే ఫలితాలను మనుషులపై ప్రభావం చూపవని కొన్ని పరిశోధనలు పేర్కొంటున్నాయి. అడపాదడపా ఇలాంటి కృత్రిమ తీపిపదార్థాలతో కలిగే హాని పెద్దగా ఉండదు. కాబట్టి బేకరీ పదార్థాలను ఇష్టపడేవారు ఆందోళన పడాల్సిందేమీ లేదు. కాకపోతే స్వాభావికమైనది ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది కాబట్టి, ఆరోగ్య స్పృహతో మంచివాటినే తినడం శ్రేయస్కరం.వ
ఆర్థికపరిస్థితే అసలు కారణం
మన జీవితంలో ఆర్థిక అంశాలతో ముడిపడనది ఏదీ ఉండదు కదా! అలాగే మనదేశ ప్రజల ఆర్థిక పరిస్థితి, కొనుగోలు శక్తిని పరిగణనలోకి తీసుకుంటే ఆహారపదార్థాలు వృథా కావడానికి అంగీకరించరు. దాంతో దీర్ఘకాలం నిల్వ ఉంచడం కోసం, అవి ఆకర్షణీయంగా కనిపించడం కోసం తప్పనిసరిగా కృత్రిమ నిల్వ పదార్థాలు (ప్రిజర్వేటివ్స్), రంగునిచ్చే పదార్థాలు (కలరేటివ్ ఏజెంట్స్)పై ఆధారపడక తప్పదు. దాంతో ఆరోగ్యం కంటే పదార్థాన్ని వృథా చేయకపోవడంవైపే మొగ్గుచూపుతారు. ఇప్పుడిప్పుడే ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో కాస్తంత మార్పు వస్తోంది. అయినప్పటికీ పూర్తి మార్పు లేదనే చెప్పాలి.

No comments:
Post a Comment