Thursday, February 13, 2014

లెమన్ టీ

బరువు తగ్గడం అంటే అంత సులభం కాదు. అందులోనే రుచికరమైన వంటలు, స్నాక్స్, పిజ్జా, బర్గర్, చీజ్ సాడ్విచ్ మరియు చాక్లెట్స్ డిజర్ట్స్ తినే వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కోరికలను కంట్రోల్ చేసుకోలేక,
అధికంగా ఏది పడితే అది తింటూ మరింత అధిక బరువును పొందుతున్నారు. దాంతో వ్యాయామాలు చేయడం మరియు బరువును తగ్గించుకోవడం మరింత కష్టంగా మారుతోంది. అయితే అధనపు బరువు తగ్గించుకోవడానికి వ్యాయామాలు మరియు డైట్ మాత్రమే సరిపోవు. బరువు తగ్గించుకొని మీకు నచ్చిన షేప్ ను పొందడానికి ఇతర మార్గాలు కూడా అనేకం ఉన్నాయి .

బరువు తగ్గించుకోవడానికి కొన్ని సూపర్ ఫుడ్స్ మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మరియు ఇతర బెవరేజెస్(ద్రవాలు)వంటివి బరువు తగ్గడానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గించే వెజిటేబుల్స్ మరియు పండ్ల గురించి మనం ఇంతకు ముందు చాలానే తెలుసుకొన్నాం. అయితే బెవరేజెస్ కూడా బరువు తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతాయి అందులో ముఖ్యంగా ‘టీ'. బరువు తగ్గించే వివిధ రకాల టీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి బరువు తగ్గించడంతో పాటు, ఆనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి . టీ శక్తిని ఇస్తుంది. అలాగే టీలో హార్టో స్ట్రోక్ మరియు యాంటీక్యాన్సర్ లక్షణాలు కలిగి ఉన్నాయి. అలాగే బరువు తగ్గించే లక్షణాలు కలిగిన టీ చాలా పాపులర్ అవుతోంది. మరి బరువు తగ్గించే వివిధ రకాల టీల గురించి తెలుసుకుందాం...


No comments:

Post a Comment