Saturday, February 15, 2014

ముఖ చర్మంలో ముడుతలు: పరిష్కారమార్గం...

అందం విషయంలో స్త్రీలు తీసుకొన్నంత శ్రద్ద పురుషులు తీసుకోరు, అందుకే వారు అప్పుడప్పుడు కొన్ని చర్మ సమస్యలకు లోనవుతుంటారు. మొటిమలు మచ్చలు
, స్కిన్ బర్న్, స్కార్స్ వంటి సమస్యలు వీటికి తోడు ముడుతలకు కూడా పురుషుల అందాన్ని తగ్గించివేస్తాయి. అందుకు మార్కెట్లో వివిధ రకాల కెమికల్ బేస్డ్ యాంటీ వ్రింకిల్స్ క్రీములు అందుబాటులో ఉన్నకూడా, అవి అప్పటికప్పుడు ఫలితాన్ని చూపెడుతాయి కానీ, శాస్వత పరిష్కారం మాత్రం చూపవు. ముఖ్యంగా పురుషుల్లో ముఖంలో ముడుతలకు ప్రధానకారణం, వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్ర , అందంగా కనబడుటకు సరైన శ్రద్ద తీసుకోకపోవడం లేదా అవగాహన లేకపోవడం. ఫలితంగా మొటిమలు, మచ్చలతో పాటు నుదిటి మీద కళ్ళక్రింది, చంపల మీద ముడుతలు ఏర్పడుతాయి. చిన్న వయస్సు కలిగి ఉన్నా కూడా వయస్సైన వారిలా కనబడేలా చేస్తాయి. కాబట్టి ఈ సమస్యను నివారించుకోవడానికి సరైన నిద్రను పొందాలి. పురుషుల ముఖంలో ముడుతలను తగ్గించుకోవడం కసం, మార్కెట్లో లభించే క్రీములకన్నా, ఇంట్లోనే చాలా సులభమైనటువంటి పరిష్కార మార్గాలున్నాయి..అవేంటో ఒక సారి చూద్దాం... 

నిద్ర: ముడుతలకు ముఖ్య కారణం నిద్ర, సరైన నిద్ర పొందలేకపోయినా, లేదా నిద్రించే భంగిమ సరిగా లేకపోయినా, ముడుతలకు దారితీస్తుంది. కాబట్టి, రోజులో కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం చాలా అవసరం. 
యూవీ కిరణాల నుండి రక్షణ పొందడం: స్త్రీలతో పోల్చితే పురుషులు సన్ స్ర్కీన్ లోషన్ వాడటం చాలా తక్కువ. వారి కఠిన చర్మానికి సన్ స్ర్కీన్ లోషన్ అవసరం లేదనుకుంటారు. కానీ పురుషుల చర్మంలోనికి యూవికిరణాలు లోతుగా చొచ్చుకొనే పోయి స్కిన్ డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి, బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. 
కోపాన్ని తగ్గించుకోవాలి: పురుషులు ప్రతి చిన్న విషయానికి కోపగించుకొనే వారు కూడా ఉంటారు. అటువంటి వారిలో ఈ ముడుతల సమస్య ఎక్కువగా ఉంటుంది. అధికంగా కోపగించుకోవడం వల్ల అది ముఖ కండరాలను మరియు చర్మాన్ని బాధిస్తుంది. ఫలితంగా ముఖంలో మరింత చెడుగా తయారువుతుంది. కాబట్టి, కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. యాంటీఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్: ప్రస్తుత జనరేషన్ లో ఆహారపు అలవాట్లతో పాటు వాతావరణంల మార్పులు, కాలుష్యం వల్ల కూడా ముడుతలకు కారణం అవుతుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నటువంటి, దానిమ్మ, మరియు గ్రీన్ టీ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తీసుకోవాలి. 
ధూమపానం మానేయాలి: పురుషుల్లో ఎవరైతే ఎక్కువగా సిగరెట్లు త్రాగుతారు, వారి ముఖంలో ముడుతలు ఎక్కువగా కనబడుతుంటాయి . మీ వయస్సును మరింత ఎక్కువగా కనబడేలా ఈ ముడుతలు చేస్తాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకూ సిగరెట్లు త్రాగడం మానేయడం వల్ల ముడుతలను తగ్గించుకోవచ్చు. ఇంత కంటే ఉత్తమ మార్గం మరొకటి ఉండదు. మీరు నవ్వండి మరియు ఇతరులను నవ్వించండి: సంతోషంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలుండవు, అదే బాధలో ఉన్నప్పుడు ఏదో ఒక జబ్బు వచ్చిపడుతుంది. అంటే ఆ సమస్యయంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. అంటే అది మనస్సుకు సంబంధించినది. కాబట్టి, ఎప్పుడు సంతోషంగా ఉంటూ, ఒత్తిడి లేకుండా జీవించాలి. ముడుతలు తగ్గించుకోవడానికి ఒత్తిడిని తగ్గించుకోవడం ఒక ఉత్తమ మార్గం.

No comments:

Post a Comment