మార్కెట్లో ‘టీ' లలో ఒక ఉత్తమమైన ‘టీ', ‘గ్రీన్ టీ'. ప్రతి రోజూ టీని
తీసుకొనే వారు కొన్ని వేలలో ఉంటారు. గ్రీన్ టీ తీసుకోవడం మొదలు పెట్టిన
తర్వాత బ్లాక్ టీ మరియు మిల్క్ టీ కొంచెం వెనుకబడిపోయాయి. ఎవరైతే గ్రీన్
టీను రెగ్యులర్ గా రొటీన్ గా తీసుకుంటారో వారు, గ్రీన్ టీ త్రాగని వారి
కంటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు.
కొన్ని పరిశోధన ద్వారా, బరువు తగ్గడానికి, క్యాన్సర్ నివారించడానికి మరియు
శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా పనిచేయడానికి గ్రీన్ టీ చాలా
సహాయపడుతుందని కనుగొనబడింది. వీటన్నిటితో పాటు, గ్రీన్ టీ, ప్రత్యేకంగా
పొట్ట సమస్యలను ఎలా నివారిస్తుందని తెలుసుకోవడానికి బోల్డ్ స్కై మీకు ఈరోజు
ఈ వ్యాసంను అంధిస్తోంది. కాబట్టి, మీరు ఎవైనా పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్స్
కు గురియైనప్పుడు లేదా పొట్ట సమస్యలున్నప్పుడు, గ్రీన్ టీ తప్పకుండా
సహాయపడుతుంది.
పొట్టలోని పెద్ద ప్రేగులోని చెడు బ్యాక్టీరియాను ఎదుర్కొనే మంచి
బ్యాక్టీరియా గ్రీన్ టీలో ఉన్నాయి. ఇవి పొట్టలో ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా
నివారిస్తుంది. కాబట్టి, ప్రతి రోజూ రెగ్యులర్ గా మీరు రెండు కప్పుల గ్రీన్
టీని త్రాగాలి . ప్రతి రోజూ ఉదయం పరగడపున గోరువెచ్చని గ్రీన్ టీకి,
కొద్దిగా తేనె మిక్స్ చేసుకొని గ్రీన్ టీ త్రాగడం మరియు మరో కప్పు సాయంత్రం
కూడా గ్రీన్ టీ త్రాగడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది.

No comments:
Post a Comment